కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah ) మళ్లీ ఢిల్లీ ఎయిమ్స్ ( AIIMS )లో చేరారు. ఇటీవలనే కరోనా ( Coronavirus ) నుంచి కోలుకున్న అమిత్ షా.. అనంతరం కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఎయిమ్స్‌లో చేరి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET 2020 Exam) నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) సర్వం సిద్ధం చేసింది. సెప్టెంబర్ 13న మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) వినాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు.. నాయకులు.. ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, కొడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్య అందరూ కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.
పార్లమెంట్ చరిత్రలో ప్రస్తుత వర్షకాల సమావేశాలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 1 వరకు జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు.. సభ్యులందరూ 3రోజుల ముందుగానే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. దీంతోపాటు ఈ సెషన్‌కు సెలవులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
CoronaVirus In India | ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని కారణంగా భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. విదేశీయులకే కరోనా వస్తుందని, విదేశాల నుంచి వచ్చిన వారికే వచ్చిందని.. భారతీయులకు కరోనా సోకలేదంటూ మొదట్లో ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. కానీ రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం పాకులాడుతున్నారు.
తెలంగాణలో కరోనా వైరస్ కేసుల లెక్కలు తేలడం లేదు. కేసుల సంఖ్య, రిపోర్టులు వాస్తవాలు కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. హైకోర్టు సైతం కరోనా లెక్కలపై ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. తాజాగా 2,426 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే (MLA RK Tests Positive for COVID19), తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాలకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
కరోనా వైరస్ వల్ల బ్రేక్ రావడంతో కొన్ని నెలలపాటు అన్ని షూటింగ్స్ రద్దయ్యాయి. మధ్యలో షూటింగ్ మొదలుపెట్టినా కరోనా కేసులు రావడంతో ఆపేశారు. తాజాగా షూటింగ్స్ ప్రారంభం కావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు సెట్స్‌లో న్యూ లుక్ (Mahesh Babu New Look)తో దర్శనమిచ్చాడు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతోంది. నిత్యం 10వేల కరోనా కేసులు (CoronaVirus Cases In AP) నమోదు కావడం రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా మరణాలు ప్రతిరోజూ భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా ఎంసెట్ 2020 (EAMCET) ప్రవేశ పరీక్షలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నేపథ్యంలో అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.
కోవిడ్19 వ్యాక్సిన్ అందిస్తుందని భావిస్తోన్న ఆక్స్ఫర్డ్ టీకా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిపివేశారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా (Astra Zeneca Vaccine), ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు కలిసి పనిచేస్తున్నాయని తెలిసిందే.
మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. కోవిడ్19 టెస్టుల సాకుతో ఓ ఆరోగ్య అధికారి నర్సుపై లైంగిక దాడి (Kerala Nurse Raped)కి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Indias COVID19 tally surpassed Brazil | ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులలో భారత్ రెండో స్థానానికి చేరింది. తాజాగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసులతో బ్రెజిల్‌ను భారత్ వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది.
COVID19 Cases In Telangana | తెలంగాణలో గత వారంతో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా రాష్ట్రంలో 1,802 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారించారు. అదే సమయంలో నిన్న ఒక్కరోజే 9 మంది కరోనాతో మరణించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ( Andhra Pradesh ) రోజు రోజుకూ కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు, రాజకీయ నాయకులను కూడా ఈ వైరస్ వదలడం లేదు.
తెలంగాణలో తాజాగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు (COVID19 Cases In Telangana) నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 32,553 కరోనా యాక్టివ్ కేసులున్నాయని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
ప్రసిద్ధ హజ్రత్ నిజాముద్దీన్ దర్గా (Hazrat Nizamuddin Dargah) ఆదివారం నాడు తెరుచుకుంది. నేటి ఉదయం నుంచే ప్రార్థనలు చేసుకునేందుకు దర్గాకు తరలివస్తున్నారు. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు, మరణాలు పెరుగుతున్న క్రమంలో అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
కోవిడ్19 పరిస్థితులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపానల్ అయిన ప్రతి ఆస్పత్రిలోనూ హెల్ప్ డెస్క్ కచ్చితంగా ఉండాలని, ఆరోగ్య మిత్రలతో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటుచేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.