EX MP Ponguleti Srinivas Reddy News: అభిమానులు, కార్యకర్తల నిర్ణయం మేరకే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు రేవంత్ రెడ్డి. ఖమ్మంలో 10కి 10 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Telangana Congress Party: తెలంగాణాలోని కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. అదే జూలై 2 టెన్షన్. అదే రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతానని పొంగులేటి ప్కటించారు.
కాంగ్రెస్‌లో సీట్ల కోసం ఫుల్ డిమాండ్ నెలకొంది. పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాకతో కాంగ్రెస్‌లో ఫుల్ జోష్ నెలకొంది. పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి రాయల నాగేశ్వరరావు టికెట్ ఆశిస్తున్నారు.
Congress Party: కర్ణాటక విజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. కొత్తగా కీలక నేతల చేరికతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలను ఢిల్లీ పిలిపించుకుంది.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. రాహుల్ గాంధీని కలిసేందుకు ఇద్దరు నేతలు తమ అనుచరులతో కలిసి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. రాహుల్ గాంధీతో భేటీకానున్నారు.
35 BRS Leaders To Join Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కీలకమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయా ? బీఆర్ఎస్ పార్టీ నుంచి పదుల సంఖ్యలో నేతలు ఇతర పార్టీల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా ? మరీ ముఖ్యంగా ఒక్క కాంగ్రెస్ పార్టీలోకే 35 మంది బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు రంగం సిద్ధం అవుతోందా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది.
Patriotic Democratic Alliance: కేంద్రం బీజేపీని మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు దేశంలోని విపక్ష పార్టీలు వ్యూహం రచిస్తున్నాయి. పేట్రియాటిక్ డెమోక్రటిక్ అలయన్స్ పేరుతో కూటమిగా ఏర్పడనున్నాయి. వచ్చే నెలలో ప్రతిపక్షాల అజెండా వెల్లడికానుంది.
కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా షాక్‌లు ఇస్తోంది. ఆయన అనుచరులపై వరుసగా కేసులు నమోదు చేస్తోంది. పొంగులేటి ముఖ్య అనుచరుడు మువ్వా విజయ్ బాబు సీఐడీ కేసు నమోదు చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 100 శాతం అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోస్యం చెప్పారు. ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు.
Congress-YSRTP Alliance: కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీన వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరికకు దాదాపు ముహూర్తం ఖరారు అయిందని ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో చర్చలు మొదలయ్యాయని వార్తలు వస్తున్నాయి.
కామారెడ్డిలో డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ సవాళ్లు.. ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు.
Revanth Reddy Satires on Bellampalli MLA Durgam Chinnaiah: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, " ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే గురించి ప్రస్తావించేందుకు తనకే సిగ్గనిపిస్తోంది " అని అన్నారు. " దుర్గం చిన్నయ్య గురించి మాట్లాడటానికి సిగ్గనిపిస్తోంటే.. మరి ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకోవడానికి వాళ్ల నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఏమనిపించడంలేదా ? " అని ప్రశ్నించారు.
Revanth Reddy About Pro. Haragopal: ప్రొ. హరగోపాల్‌తో పాటు మరో 152 మందిపైన తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఉపా కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పాలకులు ప్రజాస్వామ్య వాదులను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడిన రేవంత్ రెడ్డి... ప్రో. హరగోపాల్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప మేధావి అని కొనియాడారు.
బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారు అయింది. రేపు ప్రెస్‌మీట్ ప్రకటించే అవకాశం ఉంది.
Rajnath Singh: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకాను సీజనల్ హిందూవుగా అభివర్ణిస్తూ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Minister Harish Rao: మహాభారతంలో కౌరవుల్లాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ గౌరవెల్లి ప్రాజెక్టును ఆపాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ చివరకు న్యాయం గెలిచి ధర్మం నిలబడ్డట్టు మేము రైతుల కోసం, ప్రజల కోసం చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశాం.
Revanth Reddy About Rythu Bandhu Scheme: రాజకీయాలనే భవిష్యత్తుగా మార్చుకుని ప్రజా సేవ చేయాలనుకునే వారికి యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదిక అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నాయకుడుగా మారడానికి యూత్ కాంగ్రెస్ ఒక చక్కటి వేదిక అవుతుంది అని చెప్పడానికి తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేనే మనకు ఒక ఉదాహరణ అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
BRS MLC Kalvakuntla Kavitha: తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందని ఇల్లే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఏం చేశారని సంబరాలు జరుపుకుంటున్నారని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు ఇంటింటికి తిరిగి ఫలాలు ఎలా అందుతున్నాయో చూడాలని సవాల్ విసిరారు. మంచి పనులు చేయడంలో దేశానికి తెలంగాణ ఉదాహరణగా నిలిచిందని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.