MLC Jeevan Reddy: ఆ మంత్రి ముక్కును ప్రజలు నేలకు రాపిస్తారు.. ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

MLC Jeevan Reddy on BRS Govt: బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే దశాబ్ధి ఉత్సవాలను నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని అన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 20, 2023, 04:19 PM IST
MLC Jeevan Reddy: ఆ మంత్రి ముక్కును ప్రజలు నేలకు రాపిస్తారు.. ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

MLC Jeevan Reddy on BRS Govt: తెలంగాణలో 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేసినట్లు నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. 20222లో ఒక్క ట్రాన్స్‌ఫార్మర్‌తో అయినా 24 గంటల విద్యుత్ సరఫరా చేశారా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రతి పథకానికి కాంగ్రెస్ పథకాలే ఆధారం అని అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధితోనే జగిత్యాలకు గుర్తింపు వచ్చిందన్నారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను  ప్రజలు ముక్కు నేలకి రాపిస్తారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. ఈ నెల 22న దశాబ్ద దగా పేరుతో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
 
ఉద్యమ ఆకాంక్షలతో తెలంగాణ ఏర్పడిందని.. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టారని జీవన్ రెడ్డి అన్నారు. రూ.5 లక్షల కోట్ల అప్పులు చేసి.. పుట్టబోయే ప్రతి బిడ్డపై రూ.1.25 లక్షల భారం మోపారని తెలిపారు. దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దశాబ్ద ఉత్సవాలను నిర్వహిస్తోందన్నారు. అధికార దుర్వినియోగం చేసిన
తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంఎగ్రెస్ ఆధ్వర్యంలో దశాబ్ది దగా నినాదంతో ఈ నెల 22న ప్రదర్శన చేపడుతున్నామని చెప్పారు. ఏయే రంగంలో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందో.. ఆ రంగంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు. 

"2022-23లో ఒక్కో నియోజకవర్గంలో 1500 మందికి 10 లక్షలు సాయం చేస్తామని చెప్పి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. దళిత బంధు కేవలం ప్రచారానికే పరిమితం చేశారు. రాజ్యాంగ పరంగా దళితులకు దక్కాల్సిన హక్కులను  తెలంగాణ ప్రభుత్వం కాల రాస్తోంది. బీసీ యాక్షన్ ప్లాన్ నాలుగేళ్లుగా  నిలిచిపోయింది. ఒక్కరికీ కూడా ఆర్థిక సహాయం కల్పించలేదు. నాలుగేళ్లుగా దేశంలో ఒక్కరికి కూడా ఉపాధి కల్పించని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే.. 90 శాతం ప్రజలను విస్మరించి, 10 శాతం ప్రజలకు లబ్ది చేకూర్చేలా లక్ష  ప్రకటించి, బలహీన వర్గాలను మభ్య పెడుతున్నారు. 

మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ మా పరిధిలో లేదు అంటున్న కేసీఆర్ రిజర్వేషన్ కల్పిస్తామని ఎందుకు హామీ ఇచ్చారు..? మైనారిటీలకు నిధులు కేటాయించే అవకాశం మీ చేతుల్లోనే ఉండగా ఎందుకు కేటాయించలేదు..? తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించింది విద్యార్థులు, నిరుద్యోగులు. అందరికీ సమానంగా  విద్య అందిస్తామని ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్భంద విద్య నినాదం ఏమైంది..? రాష్ట్రంలో 30 వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఒక్క టీచర్ పోస్టు అయినా భర్తీ చేశారా..?" అని ప్రశ్నల వర్షం కురిపించారు. 

Also Read: Ram Charan-Upasana: మెగా వారసురాలు వచ్చేసింది.. తల్లిదండ్రులు అయిన రామ్ చరణ్, ఉపాసన  

Also Read: Arshin Kulkarni: చితక్కొట్టాడు.. సిక్సర్ల వర్షం కురిపించిన అర్షిన్ కులర్ణి.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News