Bihar Bridge collapse: ఇటీవల బీహర్ లోని కిషన్ గంజ్ లో మరో బ్రిడ్జీ పేకమేడలో కూలిపోయింది. దీంతో ప్రభుత్వంపై అపోసిషన్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటన మాత్రం ఇప్పుడు బీహర్ లో చర్చనీయాంశంగా మారింది.
Nitish Kumar Says Apology: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ క్షమాపణలు చెప్పారు. రాజకీయంగా తీవ్ర దూమరం రేగడంతో వెనక్కి తగ్గారు. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు నిరసన వేళ.. తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.
Threat to PM Modi, Amit Shah, Bihar CM Nitish Kumar : ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లను చంపేస్తాం అంటూ ఒక వ్యక్తి ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఢిల్లీ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు.
Attack on CM Nitish: బిహార్ ముఖ్యమంత్రిపై ఓ వ్యక్తి దాడి చేయబోయాడు. సెక్యురిటీని దాడుకుని వచ్చి దాడి చేయబోయినట్లు తెలిసింది. వీవీఐపీల భద్రత విషయంలోనే ఇలాంటి లోపాలు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Bihar prohibition: బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసులు కూడా మద్యం తాగకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. తాగి విధులకు హాజరైతే శాశ్వతంగా ఉద్యోగం నుంచి పీకేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాట్నాలో ఆదివారం జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) సమావేశంలో కూటమి భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, వీఐపీ, హెచ్ఏఎమ్ పార్టీలు జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ (Nitish Kumar elected NDA leader) ను ఎన్నుకున్నాయి.
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోయింది. బీజేపీ కంటే జేడీయూ తక్కువ స్థానాలు సాధించడంతో నితీష్ కుమార్ మరోసారి సీఎం అవుతారా లేదే అనే సందేహం నెలకొంది వాస్తవానికి.
బీహార్ ఎన్నికల అనంతరం రాజకీయ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు ముఖ్యమంత్ర నితీష్ కుమార్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఓటమి గ్రహించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ..ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శలు ఎక్కుపెట్టారు.
దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ ఎన్నికల సమరం మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. తొలిదశ పోలింగ్ రేపు అంటే అక్టోబర్ 28న జరగనుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి.
జబ్ తక్ సమోసామే ఆలూ రహేగా..తబ్ తక్ బీహార్ మే లాలూ రహేగా… ఇప్పటివారికి ఈ మాటలు గుర్తున్నాయో లేదో గానీ లాలూ తరచూ చెప్పిన మాటలివి. అటువంటిది బీహార్ రాజకీయాల్లో తొలిసారి లాలూతో పాటు మరో ఇద్దరు కీలకనేతల్లేకుండానే రాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పుతో ( Supreme court judgement ) బీహార్ పోలీసుల వైఖరి, ఎఫ్ ఐ ఆర్ సరైన చర్యగా నిర్ధారణైందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. సుశాంత్ సింహ్ రాజ్ పుత్ కేసును సీబీఐకు అప్పగించడంపై ఆయన స్పందించారు. అయితే ఈ విషయంపై రాజకీయంగా వ్యాఖ్యలు చేయనన్నారు.
SSR death mystery: పాట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఒకదాని తర్వాత మరొకటిగా వరుస కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుశాంత్ మృతి కేసులో కుట్ర కోణాన్ని వెలికి తీసేలా సీబీఐ దర్యాప్తునకు ( CBI investigation ) ఆదేశించాలని సుశాంత్ తండ్రి చేసిన విజ్ఞప్తిపై బీహార్ సర్కార్ తక్షణమే స్పందించింది.
Sushant Singh Rajput's death case: పాట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని... తన కొడుకు మృతి వెనుక కుట్ర కోణాలు దాగి ఉన్నాయని ఇప్పటికే పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సుశాంత్ తండ్రి కెకె సింగ్.. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్‌కి మరో విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీలో పౌర సత్వ సవరణ చట్టం 2019 పై చర్చ సందర్బంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఘాటు విమర్శలు చేశారు. బీహార్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని తేజస్వి మండిపడ్డారు.
బీహార్‌లో జాతీయ పౌర పట్టిక (NRC)పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి తన వైఖరిని స్పష్టంచేశారు. ఎన్డిఏ భాగస్వామి అయిన నితీష్ కుమార్ ఎన్ఆర్సి, ఎన్పిఆర్, సిఎఎలపై వారి వైఖరి ఏంటో స్పష్టంచేయాలని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ చేసిన డిమాండ్‌కి స్పందిస్తూ సీఎం నితీష్ కుమార్ అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు.
పౌరసత్వ సవరణ బిల్లు 2019 (CAB 2019), జాతీయ పౌర పట్టిక(NRC)లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఈ రెండు అంశాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
పౌరసత్వ సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు పలకడం నిరాశకు గురి చేసిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సలహాదారుడు ప్రశాంత్ కిశోర్ అన్నారు. రాజ్యాంగంలోని మొదటి పేజీలోనే మూడు సార్లు లౌకికవాదం అనే పదం ఉందని ఆయన పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.