'కరోనా వైరస్' దెబ్బకు అమెరికా విలవిలలాడుతోంది. అగ్రరాజ్యం అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతోంది. రోజు రోజుకు నిరుద్యోగిత శాతం విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఆమెరికా అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. సేవ్ జాబ్స్ పేరుతో ఆందోళన తీవ్రతరమవుతోంది.
కరోనావైరస్ పుట్టుకపై అమెరికా నేషనల్ ఇంటెలీజెన్స్ ఓ కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ మనిషి సృష్టించిందేనని, చైనాలోని వుహాన్ ల్యాబ్లో ప్రమాదవశాత్తుగా అది బయటపడిందని వస్తోన్న కథనాలను అమెరికా నేషనల్ ఇంటెలీజెన్స్ డైరెక్టర్ కొట్టిపారేశారు.
రెండో దశలో 'కరోనా వైరస్'.. వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను గడగడా వణికిస్తున్న మహమ్మారి వైరస్ కారణంగా పాజిటివ్ కేసులు 20 లక్షలు దాటిపోయాయి.
'కరోనా వైరస్'.. అమెరికాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. వైరస్ అతి దారుణంగా దెబ్బతిన్న దేశం ఏదైనా ఉందంటే అది అమెరికానే కావడం విశేషం. చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ఆ దేశం కంటే అమెరికానే ఎక్కువదా దెబ్బతీసింది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది.
అమెరికాలో కరోనా వైరస్ కారణంగా ఒక్కరోజులోనే 2,108 మంది మృతి చెందడం ఆ దేశ పౌరులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు ఉన్న గణాంకాల ప్రకారం కరోనా వైరస్ కారణంగా ఒక దేశంలో 24 గంటల్లోనే ఇంతమంది చనిపోవడం అనేది ఇదే తొలిసారి.
కరోనా వైరస్ చికిత్స కోసం ఉపయోగిస్తోన్న హైడ్రోక్లోరోకిన్ ఔషదాన్ని తమకు ఎగుమతి చేయాల్సిందిగా 25 దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు భారత్ ఓకే చెప్పింది. దేశంలో ఉన్న నిల్వల గురించి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత ఎన్నో సమాలోచనలు చేసిన తర్వాతే భారత సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
భవిష్యత్తు యుద్ధాలన్నీగాల్లోనే జరుగుతాయి. శత్రువులు కూడా గాల్లోనే గాల్లో కలిసిపోతారు. ఎందుకంటే ప్రపంచంలోని సూపర్ పవర్ దేశాలన్నీ అత్యాధునిక క్షిపణులపైనే దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఏయే దేశాల వద్ద ఎటువంటి అత్యాధునిక ఆయుధాలు, మిస్సైల్స్ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నమే ఈ వారం రక్షక్ కార్యక్రమంలో ప్రధాన కథాంశం.
పంతం తగ్గని అమెరికా .. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ . . మధ్యలో భారత్ నలిగిపోతోంది. అవును ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే .. భారత ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం కానుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. .
యుద్ధమే సమస్యకు పరిష్కారం కాదని గ్రహించిన అమెరికా - ఉత్తర కొరియా చర్చలతో పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ దిశగా తొలి అడుగుపడింది. ట్రంప్ తో కిమ్ జాంగ్ భేటీకి తేదీ ఖరారైంది. జూన్ 12న సింగపూర్ లో సమావేశం కావాలని నిర్ణయించారు. శనివారం వైట్ హౌస్ లో ఉత్తర కొరియా రాయబారి కిమ్ యోంగ్ చోల్ తో దాదాపు 80 నిమిషాల పాటు చర్చించిన అనంతరం ఈ మేరకు భేటీకి సంబంధించిన ఈ తేదీని ఖరారు చేశారు. కొరియాను అణు రహిత దేశంగా మార్చాలన్న ప్రధాన ఉద్దేశంతోనే ట్రంప్, కిమ్ ల భేటీ జరుగుతోంది.
ఇది ఆరంభం మాత్రమే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.