Virat Kohli rested for West Indies Tour 2022: ఇంగ్లండ్ పర్యటన అనంతరం వెస్టిండీస్ టూర్‌కు భారత్ వెళ్లనున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. జూలై 22 నుంచి 27 వరకు జరగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ సెలెక్టర్లు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. దాంతో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఇక స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జూలై 29 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఈ టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ జట్టులోకి వస్తాడు. అయితే ఈ సిరీస్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని పక్కనపెట్టేందుకు బీసీసీఐ సెలక్టర్లు నిర్ణయించినట్లు సమాచారం తెలుస్తోంది. గాయం కారణంగా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోని మొదటి వన్డేకు దూరమైన కోహ్లీ.. కోలుకోవడానికి సమయం పడుతుందట. అందుకే అతడికి విశ్రాంతిని ఇవ్వనున్నారని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.
విరాట్ కోహ్లీతో పాటుగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా విశ్రాంతిని ఇవ్వాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నారట. గాయం కారణంగా జట్టుకు దూరమైన మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పునరాగమనం చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. విండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూయమయిన రాహుల్.. జర్మనీలో సర్జరీ చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
వెస్టిండీస్ షెడ్యూల్ ఇదే:
జూలై 22- మొదటి వన్డే
జూలై 24- రెండో వన్డే
జూలై 27- మూడో వన్డే
జూలై 29 - మొదటి టీ20
ఆగష్టు 1 - రెండో టీ20
ఆగష్టు 2 - మూడో టీ20
ఆగష్టు 6 - నాలుగో టీ20
ఆగష్టు 7 - ఐదో టీ20
Also Read: విరాట్ కోహ్లీ ఫామ్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన సౌరవ్ గంగూలీ.. ఏమన్నాడో తెలుసా?
Also Read: Disadvantages Of Oiling Hair: తరుచుగా వెంట్రుకలు రాలుతున్నాయని నూనె పెడుతున్నారా.. జాగ్రత్త సుమా..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook