Shikhar Dhawan says Sanju Samson to wait for his chances in Team India: అవకాశాల కోసం యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఇంకొంత కాలం వేచిచూడక తప్పదు అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజూ కన్నా ముందు రిషబ్ పంత్ ఉన్నాడన్నాడు. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జట్టు కోసం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని గబ్బర్ పేర్కొన్నాడు. పంత్ విషయంలో తాము తీసుకొన్న నిర్ణయం సరైందేనని, గొప్పగా ఆడిన వ్యక్తికి కచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని పంత్ అన్నాడు.
కేరళ బ్యాటర్, వికెట్ కీపర్ సంజూ శాంసన్ గత కొన్నాళ్లుగా మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ అతడికి భారత తుది జట్టులో చోటు దక్కడం లేదు. న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లలోనూ ఇదే జరిగింది. మరోవైపు వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్న రిషబ్ పంత్‌కు మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గత తొమ్మిది ఇన్నింగ్స్‌లో పంత్ 10, 15, 11, 6, 6, 3, 9, 9 27 స్కోర్లు మాత్రమే చేశాడు. దాంతో పంత్‌ను తుది జట్టులో ఆడిస్తూ.. సంజూ పట్ల కావాలనే వివక్ష చుపిస్తున్నారని బీసీసీఐపై భారత ఫాన్స్ విమర్శలు చేస్తున్నారు.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో తొలి వన్డేలో మాత్రమే ఆడిన సంజూ శాంసన్.. 36 పరుగులతో రాణించాడు. కీలక సమయంలో క్రీజులో నిలబడి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. అయినా కూడా రెండో మ్యాచ్‌లో బౌలింగ్ స్థానం కోసం దీపక్ హుడాను ఎంచుకొన్న టీమ్ మేనేజ్మెంట్.. సంజూను సైడ్ చేశారు. బుధవారం జరిగిన చివరి మ్యాచ్‌లో కూడా సంజూకు తుది జట్టులో చోటు దక్కలేదు. చివరి వన్డేలో రిషబ్ పంత్ (10) మరోసారి విఫలమయ్యాడు.
మ్యాచ్ అనంతరం శిఖర్ ధావన్ మాట్లాడుతూ... 'ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రిషబ్ పంత్ సెంచరీ బాది నిరూపించుకున్నాడు. అందుకే జట్టులో ఉన్నాడు. ఆటగాళ్లను ఎంపిక చేయడంలో ఎంతో దూరదృష్టి ఉంటుంది. సంజూ శాంసన్ గొప్ప ఆటగాడు. అతడికి ఇచ్చిన అవకాశాలను బాగా ఉపయోగించుకున్నాడు. కొన్నిసార్లు బాగా ఆడినప్పటికీ అతడికన్నా ముందు ఒక ఆటగాడు రాణిస్తే.. అతడికే అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. సంజూ అవకాశాల కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదు. పంత్ మ్యాచ్ విన్నర్. అతడి సామర్థ్యం గురించి మాకు తెలుసు' అని అన్నాడు.
Also Read: SBI Email OTP: సురక్షితమైన డిజిటల్ లావాదేవీల కోసం.. ఇ-మెయిల్ ఓటీపీని ప్రవేశపెట్టిన ఎస్‌బీఐ!
Also Read: Gujarat Assembly Election 2022: గుజరాత్ తొలి విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై దాడి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.