ధోనీ గురించి క్రికెట్ విశ్లేషకుడు సంజయ్‌ మంజ్రేకర్‌ ఆసక్తికర కామెంట్స్

   

Last Updated : Oct 2, 2018, 01:50 PM IST
ధోనీ గురించి క్రికెట్ విశ్లేషకుడు సంజయ్‌ మంజ్రేకర్‌ ఆసక్తికర కామెంట్స్

ఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తన ఆటతీరుపై గత కొంత కాలంగా విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆసియా కప్ లో ధోనీ ఆశించిన స్థాయిలో రాణించకపవడంతో అతనిపై విమర్శల జోరు మరింత పెరిగింది. ధోనీ సామర్ధ్యంపై మాజీ క్రికెటర్‌, క్రికెట్ విశ్లేషకుడు సంజయ్‌ మంజ్రేకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధోనీ ఒక బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ స్థాయిలో పోటీ ఇవ్వలేకపోతున్నాడని .. గతంలో లా అతనికి మ్యాచ్‌లను ఘనంగా ముగించే సత్తా కూడా సన్నగిల్లిందన్నాడు. కాబట్టి అభిమానుల ఇక ధోనిపై అంచనాలు తగ్గించుకుంటే మంచిదని సలహా ఇస్తున్నాడు.

వరల్డ్ కప్ వరకూ కష్టమే ...
వచ్చే వరల్డ్‌కప్‌ వరకూ ధోని కొనసాగించాలన్న టీం మేనేజ్ మెంట్ నిర్ణయంతో కూడా సంజయ్‌ మంజ్రేకర్‌ విభేధించారు. వచ్చే వరల్డ్‌కప్‌ వరకూ అతన్నే కొనసాగించడంపై తనకు అభ్యంతరం లేదు కానీ.. ధోనికి ప్రత్యామ్నాయంగా మరొకరిని సిద్ధం చేస్తే జట్టుకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

Trending News