IPL 2022 Auction: ఆ టీమిండియా ఆటగాడి కోసం.. 20 కోట్లు ఖర్చుచేసేందుకు ఆర్‌సీబీ సిద్ధం! షాక్‌లో ఫాన్స్!!

ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో టీమిండియా యువ ప్లేయర్ శ్రేయస్‌ అయ్యర్‌ని దక్కించుకునేందుకు చాలా ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయని భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2022, 10:32 PM IST
  • ఐపీఎల్ 2022 వేలం జాబితా విడుదల
  • 20 కోట్లు ఖర్చుచేసేందుకు ఆర్‌సీబీ సిద్ధం
  • షాక్‌లో టీమిండియా ఫాన్స్
IPL 2022 Auction: ఆ టీమిండియా ఆటగాడి కోసం.. 20 కోట్లు ఖర్చుచేసేందుకు ఆర్‌సీబీ సిద్ధం! షాక్‌లో ఫాన్స్!!

Aakash Chopra says RCB ready to buy Shreyas Iyer for Rs 20 crores: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలానికి సమయం ఆసనమవుతోంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో వేలం జరగనుంది. వేలంకు మొత్తం 1214 మంది క్రికెటర్లు తమ పేరును నమోదు చేసుకోగా.. ఆ జాబితాను 590కి కుదించింది బీసీసీఐ. ఇందులో 228 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. మరో 7 మంది అసోసియేట్ నేషన్స్‌కు చెందినవారు. మెగా వేలంలో పాల్గొన్నవారిలో మొత్తం 370 మంది భారత క్రికెటర్లు, 220 మంది విదేశీయులు ఉన్నారు. భారత క్రికెటర్లు భారీ ధరకు అమ్ముడుపోతారని పలువురు అంచనా వేస్తున్నారు. 

ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో టీమిండియా యువ ప్లేయర్ శ్రేయస్‌ అయ్యర్‌ని దక్కించుకునేందుకు చాలా ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయని భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. 'శ్రేయస్‌ అయ్యర్ మంచి ప్లేయర్. జట్టుని సమర్థంగా నడిపించగలడు. అందుకే ఐపీఎల్ 2022 వేలంలో అతడిని దక్కించుకునేందుకు చాలా ఫ్రాంఛైజీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తీవ్ర పోటీ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు' అని ఆకాశ్ చోప్రా అన్నాడు. 

'కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల యాజమాన్యాలు శ్రేయస్‌ అయ్యర్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఎంతైనా వెచ్చించి అయ్యర్‌ని సొంతం చేసుకునేందుకు బెంగళూరు సిద్ధంగా ఉంది. అతడి కోసం 20 కోట్లు ఖర్చుచేసేందుకు ఆర్‌సీబీ రెడీగా ఉందట. ఈ విషయాన్ని నాకు ఒకరు చెప్పారు' అని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. మరి ఈ వార్తలో ఎంత నిజముందో అతడికే తెలియాలి. వేలం జరిగితే గాని చోప్రా మాటలు నిజమో కాదో తెలియదు. ఏదేమైనా ఈ విషయం తెలిసిన ఫాన్స్ షాక్‌కు గురవుతున్నారు. 

ఐపీఎల్ 2021 వరకు శ్రేయస్‌ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు తరఫున ఆడిన విషయం తెలిసిందే. భుజం గాయం కారణంగా తొలి విడత ఐపీఎల్‌కు అయ్యర్ దూరం కావడంతో.. రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ అప్పగించింది యాజమాన్యం. కరోనా కారణంగా దుబాయ్‌లో జరిగిన రెండో విడత ఐపీఎల్‌కు శ్రేయస్‌ అందుబాటులోకి వచ్చినా.. పంత్‌నే సారథిగా కొనసాగించారు. ఐపీఎల్ 2022 కోసం ఢిల్లీ టీమ్ రిషబ్ పంత్, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్జ్, పృథ్వీ షాలను రిటైన్ చేసుకుంది. దీంతో అయ్యర్ వేలంలోకి వచ్చాడు. 27 ఏళ్ల అయ్యర్ ఐపీఎల్ టోర్నీలో 87 మ్యాచులు ఆడాడు. 

Also Read: Amritha Aiyer: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఇన్‌స్టా అకౌంట్ హ్యాకింగ్.. పోలీసులకు ఫిర్యాదు!!

Also Read: DJ Tillu Trailer: ఆ మ్యూజిక్ డైరెక్టర్ కోసం.. బట్టలు చించేసుకున్న అల్లు అర్జున్! అసొంటి పాటే కావాలంటూ (వీడియో)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News