ముంబైపై రాజ‌స్థాన్ బంపర్ విక్టరీ

జైపూర్‌లోని స్వామి మాన్‌సింగ్ స్టేడియం వేదిక‌గా ఐపీఎల్ మ్యాచ్‌లో భాగంగా ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ముంబైపై మూడు వికెట్ల తేడాతో రాజ‌స్థాన్ విజ‌యం సాధించింది.

Last Updated : Apr 23, 2018, 04:08 PM IST
ముంబైపై రాజ‌స్థాన్ బంపర్ విక్టరీ

జైపూర్‌లోని స్వామి మాన్‌సింగ్ స్టేడియం వేదిక‌గా ఐపీఎల్ మ్యాచ్‌లో భాగంగా ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ముంబైపై మూడు వికెట్ల తేడాతో రాజ‌స్థాన్ విజ‌యం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ బ్యాటింగ్ చేయ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 167 ప‌రుగులు చేసింది. అనంత‌రం 168 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజ‌స్థాన్ ఇంకా రెండు బంతులు మిగిలి ఉండ‌గా ఏడు వికెట్లు కోల్పోయి 168 ప‌రుగులు చేసింది. దీంతో మూడు వికెట్లు తేడాతో ముంబైపై రాజ‌స్థాన్ విజ‌యం సాధించింది.

ఉత్కంఠకు గురిచేసిన ఛేదనలో కృష్ణప్ప గౌతం (33 నాటౌట్‌, 11బంతుల్లో 4ఫోర్లు, 2సిక్స్‌లు) అద్భుత ప్రదర్శన రాజస్థాన్ కు మెరుపు విజయాన్ని అందించింది. 12 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన దశలో బుమ్రా వేసిన ఓవర్లో కష్ణప్ప ఏకంగా 18 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో 10 పరుగులు అవసరమవగా.. నాల్గు బంతుల్లోనే పని పూర్తి చేశాడు. ఛేదనలో సంజూ శాంసన్‌ (52), బెన్‌ స్టోక్స్‌ (40)లు రాణించటంతో రాజస్థాన్ లక్ష్యం దిశగా సాగింది. బుమ్రా (2/28) రెండు వికెట్లు తీయగా, మెక్‌క్లీగన్, కృనాల్, ముస్తాఫిజుర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

తొలుత సూర్యకుమార్(72), ఇషాన్ కిషన్(58) అర్ధసెంచరీలతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 167/7 స్కోరు చేసింది. రాజస్థాన్‌ బౌలింగ్‌లో ఆర్చర్‌ 3, కులకర్ణీ 2, ఉనద్కట్‌ 1 వికెట్‌ తీశారు. అరంగేట్రంలోనే ఆర్చర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కడం విశేషం.

Trending News