India vs West Indies, 2nd ODI: తొలి మ్యాచ్ గెలిచి మాంచి ఊపు మీదున్న టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ను కైవసం చేసేందుకు రెడీ అయింది. మరోవైపు ఈ మ్యాచ్ లోనైనా గట్టిపోటీ ఇచ్చి పరువు నిలుపుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు రెండో వన్డేకు సిద్దమయ్యాయి. బార్బడోస్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే తొలి మ్యాచ్ లో 114 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ ద్వారానైనా బ్యాటర్లు మంచి ప్రదర్శన చేయాలని మేనెజ్ మెంట్ భావిస్తోంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూర్యకుమార్ యాదవ్, హర్దిక్ పాండ్యా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. వారు ఈ మ్యాచ్ ద్వారానైనా గాడిన పడతారో లేదో చూడాలి. మరోసారి సంజూ శాంసన్‌కు నిరాశ తప్పకపోవచ్చు.
ఇక బౌలింగ్ విషయానికొస్తే.. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వడంతో మరోసారి ముఖేశ్ కుమార్, శార్దూల్ ఠాకూర్‌తో కలిసి హార్దిక్ పాండ్యా పేస్ భారాన్ని మోయనున్నారు. తొలి వన్డేల్లో భారత్ కు విజయాన్ని అందించిన కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఈరోజు జరగబోయే మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Also Read: Cricket Records: వన్డే క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ జోడీలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook