India vs West Indies: పోరాడుతున్న విండీస్.. డ్రా దిశగా చివరి టెస్టు..

India Vs West Indies: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. పలుమార్లు వరుణుడి అంతరాయం కలిగించిన విండీస్ ఏమాత్రం పట్టువిడవకుండా బ్యాటింగ్ చేసింది. ఇదే ఆటతీరు నాలుగురోజు కూడా కనబరిస్తే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 23, 2023, 06:48 AM IST
India vs West Indies: పోరాడుతున్న విండీస్.. డ్రా దిశగా చివరి టెస్టు..

India vs West Indies 2nd Test Day 3 Highlights: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు డ్రా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి టెస్టులో కరేబియన్ జట్టు గట్టిగా పోరాడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ ఐదు వికెట్లు కోల్పోయి 229 రన్స్ చేసంది. ప్రస్తుతం జేసన్ హోల్డర్ (11*), అథనేజ్‌ (37*) క్రీజులో ఉన్నారు. ఆతిథ్య జట్టు ఇంకా 209 పరుగుల వెనుకంజలో ఉంది. ఆ జట్టు ఆటగాళ్లలో బ్రాత్ వైట్ 75 పరుగులతో రాణించాడు. ఇతడికి కిర్క్ మెకంజీ (32), బ్లాక్‌వుడ్ (20) సహకారమందించారు. టీమిండియా బౌలర్లలో జడేజా రెండు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్‌ సిరాజ్‌, అశ్విన్‌, ముఖేశ్‌ కుమార్‌ ఒక్కో వికెట్ తీశారు. పలుమార్లు వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది.

86/1తో మూడోరోజు ఆటను ప్రారంభించిన కరేబియన్ ఆటగాళ్లు నిలకడగా ఆడారు. ముఖ్యంగా మెకంజీ మంచి షాట్లు కొట్టాడు. దూకుడు మీద ఉన్న అతడిని టీమిండియా అరంగేట్ర బౌలర్‌ ముకేశ్‌ కుమార్‌ ఔట్ చేశాడు. అతడు వెనుదిరిగిన వెంటనే వర్షం మెుదలైంది. వాన తగ్గకపోవడంతో 20నిమిషాల ముందుగానే లంచ్ బ్రేక్ ఇచ్చారు అంపైర్లు. మెుదటి సెషన్ లో కేవలం 10.4 ఓవర్ల ఆటే మాత్రమే సాధ్యమైంది. రెండో సెషన్‌లో బ్లాక్‌వుడ్‌ సహకారంతో బ్రాత్‌వైట్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో బ్రాత్‌వైట్‌ 170 బంతుల్లో అర్థశతకం సాధించాడు. అనంతరం అతడిని ఒక్క మచి డెలివరీతో అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత అథనేజ్‌తో కలిసి బ్లాక్‌వుడ్‌ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. టీ బ్రేక్ సమయానికి ఆతిథ్య జట్టు మూడు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. 

చివరి సెషన్ తొలి ఓవర్ లోనే బ్లాక్ వుడ్ ను జడేజా ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జాషువా ది సిల్వాను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇతడు ఔటవ్వగానే వర్షం మళ్లీ మెుదలైంది. వాన ఆగిపోవడంతో దాదాపు 50 నిమిషాల తర్వాత గేమ్ ను తిరిగి ప్రారంభించారు. అథనేజ్‌, హోల్డర్‌ మరో వికెట్ పడకుండామూడో రోజు ఆటను ముగించారు. 

Also Read: Lahiru Thirimanne: అంతర్జాతీయ కెరీర్‌కు శ్రీలంక క్రికెటర్ గుడ్‌బై.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News