Shikhar Dhawan completed 12000 List A runs: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 12000 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఏడో భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. శుక్రవారం ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఘనతను గబ్బర్ అందుకున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా ధావన్ బాధ్యతలు నిర్వరిస్తున్న విషయం తెలిసిందే.
లిస్ట్ - A క్రికెట్‌లో శిఖర్ ధావన్ 12వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ధావన్ 297 మ్యాచుల్లో 12025 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇందులో 167 అంతర్జాతీయ వన్డేలు ఉన్నాయి. వన్డేల్లో 17 సెంచరీలు, 39 అర్ధ శతకాలతో 6,744 పరుగులు చేశాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అందరి కంటే ముందున్నాడు. సచిన్ తన కెరీర్‌లో 551 మ్యాచుల్లో 21999 పరుగులు సాధించాడు. సౌరవ్ గంగూలీ (437 మ్యాచుల్లో 15,622), రాహుల్ ద్రవిడ్ (449 మ్యాచుల్లో 15,271), విరాట్ కోహ్లీ (296 మ్యాచుల్లో 13,786), ఎంఎస్ ధోనీ (423 మ్యాచుల్లో 13,353), యువరాజ్ సింగ్ ( 423 మ్యాచుల్లో 12,633) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
FIFTY for @SDhawan25 - his 3⃣9⃣th ODI half-century! 👍 👍#TeamIndia inching closer to the 100-run mark
Follow the match 👉 https://t.co/jmCUSLdeFf #NZvIND
📸 Courtesy: Photosport NZ pic.twitter.com/x8a89Un404
— BCCI (@BCCI) November 25, 2022
తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు సాధించింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (72), శ్రేయస్ అయ్యర్ (80), శుభ్‌మన్ గిల్ (50) హాఫ్ సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీ తలా మూడు వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో కివీస్ 30 ఓవర్లలో మూడు వికెట్స్ కోల్పోయి 150 రన్స్ చేసింది. న్యూజిలాండ్ విజయానికి 20 ఓవర్లలో ఇంకా 156 రన్స్ కావాలి. క్రీజులో లాతమ్ (36), కేన్ (59) ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook