Champions Trophy 2025: ఇండియా పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ రేపే, హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే

Champions Trophy 2025 Ind vs Pak: యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానుల నిరీక్షణకు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. హై వోల్టేజ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రేపు దుబాయ్ వేదికగా జరగనుంది. ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కంటే ప్రతిష్ఠాత్మకమైంది ఈ మ్యాచ్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 22, 2025, 07:49 PM IST
Champions Trophy 2025: ఇండియా పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ రేపే, హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే

Champions Trophy 2025 Ind vs Pak: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో రేపు జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. కేవలం ఈ రెండు దేశాలే కాకుండా మొత్తం క్రికెట్ అభిమానులకు ఆసక్తి రేపే మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ ఎంతటి ప్రతిష్టాత్మకమైందంటే ఏకంగా కొత్త కోచ్ నియమించుకుంది పాకిస్తాన్. 

దుబాయ్ వేదికగా రేపు అంటే జనవరి 23న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఇండియా కంటే పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఓడితే పాకిస్తాన్ ఇక టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. ఇండియాకు కూడా గెలుపు అవసరమే కానీ పాకిస్తాన్ అంత కానే కాదు. పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్ చావో రేవో తేలుస్తుంది. ఈ మ్యాచ్‌కు రెండు జట్ల మానసిక పరిస్థితి విభిన్నంగా ఉంది. బంగ్లాదేశ్‌పై విజయంతో టీమ్ ఇండియా ఉత్సాహంగా ఉంది. పాకిస్తాన్ మాత్రం న్యూజిలాండ్‌తో ఓటమి, చావో రేవో తేల్చే మ్యాచ్ కావడం వల్ల తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు లేదా ముగ్గురు రాణించినా భారీ స్కోర్‌కు తిరుగు ఉండదు. అదే విధంగా బౌలింగ్‌లో మొహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలతో బలంగా ఉంది. కుల్దీప్ యాదవ్ స్థానంలో వరుణ్ చక్రవర్తి వస్తే ఇక స్పిన్ పటిష్టంగా మారుతుంది. 

పాకిస్తాన్ విషయానికొస్తే బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్ వంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. పాకిస్తాన్‌కు ఇది చావో రేవో మ్యాచ్ అయినందున మాజీ క్రికెటర్ ముదస్సర్ నాజిర్‌‌ను నియమించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. 

ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 135 వన్డేల్లో తలపడగా టీమ్ ఇండియా 57 సార్లు గెలిస్తే పాకిస్తాన్ 73 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 5 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు పరిశీలిస్తే పాకిస్తాన్ మూడింటి, టీమ్ ఇండియా 2 మ్యాచ్‌లలో విజయం సాధించింది. చివరిసారిగా 2017లో పాకిస్తాన్..టీమ్ ఇండియాపై విజయం సాధించడమే కాకుండా టైటిల్ గెలిచింది. ఏడేళ్ల తరువాత తిరిగి అదే ట్రోఫీలో తలపడుతున్నాయి. 

టీమ్ ఇండియా అంచనా

రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమి, హర్షిత్ రాణా

పాకిస్తాన్ జట్టు అంచనా

బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హక్, మొహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ ఆఘా, కమ్రాన్ గులాం, తయ్యబ్ తాహిర్, ఖుఫ్దిల్ షా, షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్

Also read: 7th Pay Commission DA Hike: ఆ ఉద్యోగులకు హోలీ కానుక, డీఏ పెంపుతో జీతం ఎంత పెరుగుతుందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News