బీసీసీఐ మాజీ అధ్యక్షుడు విశ్వనాధ్ దత్ నిన్న ఉదయం అనారోగ్యంతో మృతిచెందారు. ప్రస్తుతం దత్ వయస్సు 93 ఏళ్లు. చాలాకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న విశ్వనాధ్ దత్.. సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్టు ఆయన తనయుడు సుబ్రతా దత్ తెలిపారు. విశ్వనాధ్ దత్ కి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు సుబ్రతా దత్ ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఎఐఎఫ్ఎఫ్) సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.