కేప్‌టౌన్‌లో క్రికెట్ సిరీస్ నిమిత్తం ఆడడానికి వెళ్లిన కోహ్లీ సేనకు నీటి సమస్య ఎదురైంది. ఆ ప్రాంతంలో నీటి సమస్య ఎక్కువగా ఉండడం వలన స్థానిక మున్సిపల్ అధికారులు క్రికెటర్లను రెండు నిమిషాల కంటే ఎక్కువ సేపు స్నానం చేయవద్దని కోరారట. ఇదే విషయంపై టీమిండియా ఆటగాళ్లను ఓ పత్రిక ప్రశ్నించగా, వారు బాగా ఆడి విజయం సాధించాలని మాత్రమే కేప్‌టౌన్‌కు వచ్చామని.. అంతేకానీ మిగతా విషయాల గురించి పట్టించుకోమని చెప్పినట్లు సమాచారం.
అలాగే ఆ ప్రాంతంలో నీటి సమస్య ఎక్కువగా ఉండడం వల్ల క్రికెట్ మైదానంలో పిచ్‌పై పచ్చికను పెంచే విషయంలోనూ కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ స్టేడియం క్యూరేటర్ ఇప్పటికే తెలిపారు. మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య కేప్‌టౌన్‌లో శుక్రవారం మొదటి టెస్టు ప్రారంభం కానుంది