IPL-2023: ఐపీఎల్ లో ఒక్కసారైనా ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కోరుకుంటాడు. ఇందులో అవకాశం వస్తే అస్సలు వదులుకోరు. కొందరు ఈ లీగ్ ద్వారా తమ ప్రతిభను చూపించాలనుకుంటారు. మరికొందరు మనీ కోసమే ఈ టోర్నీ ఆడతారు. కొంత మంది ఆటగాళ్ల అయితే జాతీయ జట్టు కన్నా ఐపీఎల్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే బంగ్లాదేశ్ కు చెందిన ముగ్గురు క్రికెటర్లు అలా చేయలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కన్నా తమ జాతీయ జట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వారే షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, తస్కిన్ అహ్మద్. వీరికి ఐపీఎల్ లో అవకాశం వచ్చినప్పటికే నేషనల్ టీమ్ కోసం దానిని వదులుకున్నారు. అలా చేసినందుకు తాజాగా ఆ దేశ క్రికెట్ బోర్డు వారిని ప్రశంసించి రివార్డు ప్రకటించింది. ఈ ముగ్గురుకి కలిపి 65 వేల డాలర్లు( సుమారు 53 లక్షలు) ఇవ్వాలని నిర్ణయించుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023 వేలంలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ బేస్ ప్రైజ్ రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఐర్లాండ్ తోటెస్టు సిరీస్ కారణంగా అతడు ఈ ఏడాది సీజన్ మెుత్తానికి దూరంగా ఉన్నాడు. లిటన్ దాస్ ను కూడా కేకేఆర్ రూ.50 లక్షలకు దక్కించుకుంది. అయితే ఇదే ఐర్లాండ్ సిరీస్ వల్ల అతడు కూడా ఒకే ఒక్క మ్యాచ్ ఆడి తిరిగి వెళ్లిపోయాడు. బౌలర్ తస్కిన్ అహ్మద్ ను లక్నో తీసుకుంది. అయితే బంగ్లా బోర్డు అతడిని ఆడొద్దని సూచించింది. దీంతో అతడు కూడా ఐపీఎల్ అవకాశాన్ని వదులుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్-2023 పైనల్ దృష్ట్యా పలువురు ఆసీస్ ఆటగాళ్లు ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడలేదు.
Also Read: MS Dhoni Bike Video: సెక్యూరిటీ గార్డుకు లిఫ్ట్ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook