Drying Plants Indication: కొన్ని మొక్కలకు హిందూమతంలో గౌరవప్రదమైన స్థానం ఉంది. మొక్కలను సంరక్షించకపోవడం, నీరు పోయకపోవడం వల్ల మొక్కలు ఎండిపోతున్నాయి. ఈ మొక్కలు (Plants) ఎండిపోవడం కొన్ని అశుభ సంకేతాలను ఇస్తుంది. భవిష్యత్తులో జరగబోయే దుష్ప్రరిణామాలను సూచిస్తుంది. ఆ సంకేతాలు ఏంటో తెలుసుకుందాం.
తులసి మెుక్క ఎండిపోవడం- చాలాసార్లు ఇంట్లోని చిన్నపాటి అజాగ్రత్త వల్ల ఇంట్లోని మొక్కలు ఎండిపోతాయి. కానీ కొన్నిసార్లు మొక్కలను పూర్తిగా సంరక్షించిన తర్వాత కూడా అవి ఎండిపోతాయి. తులసి మొక్కకు ఇలా జరిగితే లక్ష్మిదేవి మీపై కోపగించుకోవచ్చు. ఇది డబ్బు నష్టానికి సంకేతం. తులసి మొక్క లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది మరియు ఇది విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. కాబట్టి తులసి మొక్క పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.
మనీ ప్లాంట్ - వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో ఉంచడం శ్రేయస్కరం. వినాయకుడు ఈ దిక్కున నివసిస్తాడని, డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు. కానీ నాటిన మనీ ప్లాంట్ ఎండిపోతే, అది డబ్బు పరంగా శుభపరిణామంగా పరిగణించబడదు. ఇది డబ్బు కొరతను సూచిస్తుంది.
శమీ మొక్క- శమీ చెట్టు చాలా శ్రేయస్కరం. శని గ్రహానికి సంబంధించిన సమస్యల నుండి బయటపడటానికి శమీ చెట్టును పూజిస్తారు. అయితే మీ పచ్చని శమీ చెట్టు అకస్మాత్తుగా ఎండిపోతే, అది శని యొక్క చెడు స్థితి మరియు శివుని కోపానికి సంకేతం. ఇలా జరిగినప్పుడు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పనులకు ఆటంకం ఏర్పడుతోంది.
అశోక వృక్షం- సానుకూలత కోసం ఇంటి ఆవరణలో అశోక చెట్టును నాటుతారు. ఈ చెట్టు ఎండిపోతే ఇంటి శాంతికి భంగం కలుగుతుందన్నమాట. అటువంటి పరిస్థితిలో, అశోక చెట్టును జాగ్రత్తగా చూసుకోండి.
మామిడి చెట్టు - మామిడి చెట్టును హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మామిడి ఆకులను పూజా కార్యక్రమాలలో కూడా ఉపయోగిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మామిడి చెట్టు ఎండిపోవడం భవిష్యత్తులో జరగబోయే కష్టాల గురించి చెబుతుంది. ఇది మీకు కూడా జరిగితే, జాగ్రత్తగా ఉండండి.
Also Read: Money Plant Vastu Tips: ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే ధనలక్ష్మీ మీ వెంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.