Surya Shani Yuti 2023: శని, సూర్యల 'అశుభ యోగం'.. 2023లో వీరి జీవితం కష్టాలమయం..

Surya And Shani Yuti 2023: త్వరలో కుంభరాశిలో సూర్యుడు మరియు శని కలయిక జరగబోతుంది. వీటి కారణంగా ఏర్పడిన అశుభకర యోగం 3 రాశుల వారికి అననుకూలంగా ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2022, 03:28 PM IST
Surya Shani Yuti 2023: శని, సూర్యల 'అశుభ యోగం'.. 2023లో వీరి జీవితం కష్టాలమయం..

Surya And Shani Yuti 2023: శాస్త్రాల ప్రకారం, శనిదేవుడికి తండ్రి సూర్య దేవుడు. కానీ ఇద్దరికీ క్షణం కూడా పడదు. జనవరి 17న శనిదేవుడు, ఫిబ్రవరి 13న సూర్యదేవుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తారు. వీరిద్దరి సంయోగం (Surya And Shani Yuti 2023) వల్ల అశుభకరమైన యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం ప్రజలందరిపై ఖచ్చితంగా ఉంటుంది. ఈ యోగ ప్రభావం దృష్ట్యా మూడు రాశులవారు  జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

కర్కాటక రాశిచక్రం (Cancer): శని మరియు సూర్యుని కలయిక ఈ రాశివారికి హాని చేయవచ్చు. ఈ ఆశుభకరమైన యోగం మీ జాతకంలో 8వ ఇంట్లో ఏర్పడుతోంది. ఆ సమయంలో మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. వ్యాపారస్తులు డబ్బు లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. మీరు అనారోగ్యం కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. 

వృశ్చిక రాశిచక్రం (Scorpio Zodiac): శని మరియు సూర్యుని కలయిక మీకు అననుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో వీటి కలయిక ఏర్పడుతుంది. మీరు ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాలి. శని దేవుడు చెడు ప్రభావం వల్ల మీరు మానసిక క్షోభ అనుభవిస్తారు. మీ పనుల్లో జాప్యం జరుగుతుంది. వ్యాపారంలో ఏదైనా డీల్ ఖరారు అయి ఆగిపోయే అవవకాశం ఉంది. 

కుంభం ((Aquarius Zodiac): శని మరియు సూర్యుని కలయిక మీకు అశుభకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు గ్రహాల కలయిక మీ సంచార జాతకంలో లగ్నస్థిలో ఏర్పడుతుంది. మీ లైఫ్ పార్టనర్ తో సంబంధం చెడిపోయే అవకాశం ఉంది.  మీ కుటుంబ సభ్యులు విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సమయం మీకు అనుకూలంగా ఉండదు.

Also Read: Jupiter Transit: 2023లో గజలక్ష్మి యోగం ఈరాశుల వారిని కోటీశ్వరులను చేస్తుంది.. ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News