Surya Shani Yuti 2023: మీనంలో ముగిసిన శని-సూర్య కూటమి.. ఈ రాశులకు మంచి రోజులు మెుదలు..

Surya Shani Yuti 2023:  ఆస్ట్రాలజీలో సూర్యుడు మరియు శనిదేవుడులను తండ్రీ కొడుకులుగా భావిస్తారు. రీసెంట్ గా వీరిద్దరి కూటమి మీనంలో ముగిసింది. దీంతో మూడు రాశులవారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2023, 11:28 AM IST
Surya Shani Yuti 2023: మీనంలో ముగిసిన శని-సూర్య కూటమి.. ఈ రాశులకు మంచి రోజులు మెుదలు..

Surya Shani Yuti 2023: భారతీయ జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు మరియు శని గ్రహాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ రెండింటి యెుక్క గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. సూర్యదేవుడు మార్చి 15 వరకు కుంభరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత మీనరాశిలోకి ప్రవేశించాడు. శని సూర్య కలయిక ముగియడం వల్ల కొన్ని రాశులవారు శుభఫలితాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషరాశి
సూర్యుడు మరియు శని కలయిక ముగియడం వల్ల మేషరాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశిలో శనిదేవుడు ఉదయించడం మరియు మీన రాశిలో సూర్యుడు ప్రవేశించడం వల్ల మీరు భారీ లాభాలను గడిస్తారు. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. 
వృషభం
వృషభ రాశి వారు సూర్యుడు మరియు శని సంయోగం ముగియడం వల్ల ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. శనిదేవుడు మీ జాతకంలో శష రాజయోగం మరియు కేంద్ర త్రికోణ రాజయోగాన్ని సృష్టించాడు. దీని వల్ల మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. 
కుంభ రాశి
సూర్యుడు మరియు శని సంయోగం కుంభరాశిలో ముగియడం వల్ల మీకు మంచిరోజులు మెుదలవుతాయి. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. వ్యాపారులు భారీగా లాభపడతారు. మీరు ఏదైనా ల్యాండ్ లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా బలపడతారు. 

Also Read: Rahu Gochar 2023: త్వరలో మీనరాశి ప్రవేశం చేయనున్న రాహువు.. ఈ 3 రాశులకు కలిసిరానున్న కాలం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News