Hanuman Fav Zodiacs: 2024లో ఈ రాశులకు హనుమంతుని కటాక్షం.. ఇక వీరికి డబ్బే డబ్బు..

Lord Hanuman: మంగళవారం రోజున హనుమాన్ ను పూజిస్తారు. ఈ దేవుడికి కొన్ని రాశులవారు అంటే చాలా ఇష్టమట. 2024లో వీరిపై కాసుల వర్షం కురిపించనున్నాడు ఆంజనేయుడి. ఆ ప్రత్యేక రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2023, 05:38 PM IST
Hanuman Fav Zodiacs: 2024లో ఈ రాశులకు హనుమంతుని కటాక్షం.. ఇక వీరికి డబ్బే డబ్బు..

Hanuman Favourite Zodiacs in 2024: హిందూమతంలో హనుమంతుడికి చాలా ప్రాధాన్యత ఉంది. హిందువులు ప్రతి మంగళవారం ఆంజనేయుడిని పూజిస్తారు. పురాణాల ప్రకారం, శ్రీరాముడు భక్తుడు హనుమాన్. ఇతనిని రామదూత, రామబంటు, మారుతి, వాయుపుత్రుడు, అంజనీసుతుడు, బంజరంగీ, కేసరీనంద రకరకాల పేర్లుతో పిలుస్తారు. ఇతడు చిరంజీవి, నవబ్రహ్మగా కూడా ప్రసిద్ది చెందినాడు. మీరు కష్టకాలంలో హనుమాన్ ను పూజిస్తే మీకు మంచి జరుగుతుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మారుతికి కొన్ని రాశులవారు చాలా ఇష్టమట. వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటాడట. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

మేషం: 2024లో హనుమాన్ దయ వల్ల మేష రాశి వారికి మంచి రోజులు మెుదలవుతాయి. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం, జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభిస్తకుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 
వృషభం:  ఈ రాశి వారు మంగళవారం నాడు ఆంజనేయుడిని పూజిస్తే మంచి జరుగుతుంది. వ్యాపారులు లాభపడతారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. 
కర్కాటక రాశి: మారుతికి ఇష్టమైన రాశుల్లో కర్కాటక రాశి ఒకటి. హనుమాన్ కృప కారణంగా వీరు శుభవార్తలను వింటారు. మీరు ఫ్యామిలీతో కలిసి టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. మీకు ప్రతి పనిలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. 

Also Read: Shani Shukra yuti 2024: 30 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక.. ఈ 4 రాశుల వారికి అదృష్టం, ఐశ్వర్యం..

తుల: హనుమంతుని అనుగ్రహం తులారాశి వారిపై ఎల్లప్పుడూ ఉంటుంది పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
ధనుస్సు: బజరంగ బలి కటాక్షం ఉండే రాశుల్లో ధనస్సు ఒకటి. జాబ్ కోసం ఎదురుచూసేవారి కోరిక నెరవేరుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. 

Also Read: Mangal Gochar 2023: న్యూ ఇయర్ కు ముందు ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News