Panchak: నేటి నుంచి రాజ్ పంచకము.. అసలేంటి పంచకము.. దీని ప్రభావం ఎలా ఉంటుంది...

Panchak and Its Effects : పంచక్ అంటే ఐదు రోజుల కాలం అని అర్థం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పంచక్ కాలాన్ని అశుభంగా భావిస్తారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2022, 05:18 PM IST
  • నేటి నుంచి రాజ్ పంచకము
  • జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పంచకము అంటే ఏమిటి
  • దాని వల్ల కలిగే మంచి, చెడులు ఏమిటి...
  • పూర్తి కథనం ఇక్కడ చదవండి
Panchak: నేటి నుంచి రాజ్ పంచకము.. అసలేంటి పంచకము.. దీని ప్రభావం ఎలా ఉంటుంది...

Panchak and Its Effects : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నేటి (ఏప్రిల్ 25) నుంచి 'పంచకము' ప్రారంభమవుతుంది. హిందూ మతం, జ్యోతిషశాస్త్రంలో మంచి, చెడు కాలాలను లెక్కించడంలో పంచకాలకు చాలా ప్రాధాన్యత ఉంది. సాధారణంగా 5 రోజుల పంచక్ కాలాన్ని చెడు సంకేతంగా భావిస్తారు. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరు. అయితే 'పంచంకం'లలోనూ ఆరు రకాలు ఉన్నాయి. అవేంటో.. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే పంచకం విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆదివారం నుంచి ప్రారంభమయ్యే పంచక్‌ను 'రోగ్ పంచక్' అంటారు. సోమవారం నుంచి పంచక్ కాలం ప్రారంభమైతే.. దాన్ని 'రాజ్ పంచక్' అంటారు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే పంచక్‌ను 'అగ్ని పంచక్' అని, శుక్రవారం రోజు 'చోర పంచకము' అని, శుక్రవారం రోజు ప్రారంభమయ్యే పంచక్‌ను 'చోర పంచకము' అని పిలుస్తారు. బుధ, గురువారం రోజుల్లో పంచక్‌లను బహిష్కరించినట్లు చెబుతున్నారు. పంచకములో రాజ్ పంచకమును శుభప్రదంగా భావిస్తారు.

పంచక్‌లలో శని సంచారం :

చంద్రుడు ఘృణిత, శతభిష, పూర్వ భాద్రపద, ఉత్తర భాద్రపద, రేవతి నక్షత్రాలలో సంచరించినప్పుడల్లా పంచకము జరుగుతుంది. రెండున్నరేళ్ల తర్వాత ఏప్రిల్ 29న పంచక సమయంలో శని గ్రహం రాశి మారనుంది. అటువంటి పరిస్థితిలో, ఈ పంచక్‌లు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. పంచక కాలంలో ఏదైనా చెడు జరిగితే అది ఐదుసార్లు రిపీట్ అవుతుందని నమ్ముతారు. ఈ కాలంలో ఎవరైనా మరణించినా దాన్ని అశుభంగా భావిస్తారు. మరణించినవారితో పాటు మరో ఐదుగురు మరణిస్తారని చెబుతారు. దీన్ని నివారించేందుకు మరణించిన వ్యక్తితో పాటు ఓ బొమ్మను కూడా దహనం చేస్తారు. తద్వారా మిగతావారికి మరణ గండం తప్పుతుందని భావిస్తారు.

Also Read: TS Police Notification 2022: నిరుద్యోగులకు శుభవార్త.. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల!

Also Read: Prashant Kishore to Join Congress : కాంగ్రెస్‌లోకి ప్రశాంత్‌ కిషోర్‌.. నేడో రేపో కీలక నిర్ణయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News