Pushya Masam: 102 ఏళ్ల అరుదైన సంయోగం, ఈ మూడు రాశులకు మహర్దశ నేటి నుంచి

Pushya Masam: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. గ్రహాల కలయిక, రాశుల్లో ప్రవేశం కారణంగా మనిషి జాతకంపై ప్రభావం పడుతుందంటారు. ప్రస్తుతం పుష్య మాసం పౌర్ణమి నడుస్తోంది. ఈసారి 102 ఏళ్ల తరువాత అత్యంత అరుదైన సంయోగనం ఏర్పడనుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 14, 2025, 09:52 AM IST
Pushya Masam: 102 ఏళ్ల అరుదైన సంయోగం, ఈ మూడు రాశులకు మహర్దశ నేటి నుంచి

Pushya Masam: ఈసారి పుష్య మాసం పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది. ఏకంగా 102 సంవత్సరాల తరువాత అత్యంత అరుదైన సంయోం జరగనుంది. అంటే ఆరుద్ర నక్షత్రం ఇదే పౌర్ణమి రోజున రావడం. శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర పౌర్ణమి నాడు రావడంతో పాటు సంక్రాంతి పర్వదినాలు కావడం వల్ల అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 

అటు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో షాహీ స్నానాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు సంక్రాంతి పర్వదినాలు నడుస్తున్నాయి. ఇదే సమయంలో పుష్యమాసం పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం రోజున రావడంతో ఇక జ్యోతిష్యపరంగా తిరుగులేని యోగం ఏర్పడింది. ఫలితంగా మొత్తం 12 రాశులపై ప్రభావం పడనుంది. 102 ఏళ్ల తరువాత ఏర్పడిన సంయోగం కావడంతో కొన్ని రాశులకు అద్భుతంగా కలిసి వస్తుంది. మూడు రాశులకు మహర్దశ పట్టనుంది. 

పుష్యమాసం పౌర్ణమి కారణంగా వృషభ రాశి జాతకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఊహించనివిధంగా డబ్బు లభిస్తుంది. ఉద్యోగులకు చాలా మంచి సమయం. పదోన్నతి, వేతనం పెంపు ఉంటుంది. పనిచేసే చోట గౌరవం లభిస్తుంది. వ్యాపారులు అమితమైన లాభాలు ఆర్జిస్తారు. ఈ సమయంలో శివుని దర్శిస్తే మరింత మంచి జరుగుతుందంటారు. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

సింహ రాశి జాతకులకు ఈ సమయం గోల్డెన్ డేస్ అని చెప్పవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యాపారులు కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంటుంది. అన్ని రంగాలవారికి ప్రయోజనం కలగనుంది. ఆకశ్మిక ధనలాభం కలగడం వల్ల ఆర్ధికంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఇంట్లో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. 

కన్యా రాశి జాతకులకు ఈ సమయం చాలా బాగుంటుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. కోర్టు సంబంధిత వివాదాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. జీతభత్యాలు పెరుగుతాయి. 

Also read: Kanuma Festival: కనుమ రోజు ప్రయాణాలు ఎందుకు చేయకూడదు..?.. దీని వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News