/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168

Nirjala Ekadashi Vrat 2023 Date: నిర్జల ఏకాదశిని జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో నిర్జల ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఈ రోజున ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా మోక్షం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సారి నిర్జల ఏకాదశి  మే 31న వస్తోంది. ఈ క్రమంలో వ్రతాన్ని ఆచరించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 

పురాణాల ప్రకారం..మహాభారతంలో భీముడు కూడా ఈ ఉపవాసాన్ని పాటించాడని.. ఇలా పాటించడం వల్ల 10,000 ఏనుగుల బలం పొందడానికి పేర్కొన్నారు. అయితే ఈ వ్రతాన్ని పాటించడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  

నిర్జల ఏకాదశి ప్రాముఖ్యత:
నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల ధర్మం, అర్థ, కామ, మోక్షం అనే నాలుగు పురుషార్థాలు లభిస్తాయి. అంతేకాకుండా సంతోషకరమైన జీవితం కూడా లభిస్తుంది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల పాపాలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్  

నిర్జల ఏకాదశి శుభ సమయం:
జ్యేష్ఠ శుక్ల ఏకాదశి తిథి మే 30న మధ్యాహ్నం 01:07 గంటలకు ప్రారంభమై.. మే 31 మధ్యాహ్నం 01:45 గంటలకు ముగుస్తుంది. ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని మే 31న ఆచరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని జూన్ 01 తేది కూడా పాటించవచ్చు. 

ఉపవాస విధానం:
నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు తప్పకుండా తెల్లవారుజామునే నిద్ర లేవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తల స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ తర్వాత పూజా గదిలోకి వెళ్లి శ్రీకృష్ణుడికి పూజా కార్యక్రమం ప్రారంభించాలి. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా పంచామృతం, తులసి దళాన్ని అభిషేకం చేయాలి. ఈ క్రమంలో లక్ష్మి దేవిని పూజించి మంత్రాలు పారాయణం చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి. ఇదే వ్రతాన్ని ద్వాదశి తిథి రోజున చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Section: 
English Title: 
Nirjala Ekadashi Vrat 2023: Nirjala Ekadashi Correct Date Fasting Method Nirjala Ekadashi Auspicious Time
News Source: 
Home Title: 

Nirjala Ekadashi Vrat 2023: నిర్జల ఏకాదశి సరైన తేది, ఉపవాస విధానం, శుభ సమయం!

Nirjala Ekadashi Vrat 2023: నిర్జల ఏకాదశి సరైన తేది, ఉపవాస విధానం, శుభ సమయం!
Caption: 
source file : zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
నిర్జల ఏకాదశి సరైన తేది, ఉపవాస విధానం, శుభ సమయం!
Dharmaraju Dhurishetty
Publish Later: 
No
Publish At: 
Friday, May 26, 2023 - 14:32
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
38
Is Breaking News: 
No
Word Count: 
282