Mahalaxmi Rajyog: 'మహాలక్ష్మి రాజయోగం' చేస్తున్న కుజుడు-చంద్రుడు.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..

Mahalaxmi Rajyog:  ఈరోజు కుజుడు, చంద్రుడి కలయిక వల్ల మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది. దీని వల్ల 3 రాశుల వారు డబ్బు మరియు పురోభివృద్ధి సాధిస్తారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2023, 12:34 PM IST
Mahalaxmi Rajyog: 'మహాలక్ష్మి రాజయోగం' చేస్తున్న కుజుడు-చంద్రుడు.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..

Mahalaxmi Rajyog effect:  గ్రహాల కాలానుగుణంగా శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. ఇవాళ అంటే ఫిబ్రవరి 26 సాయంత్రం వృషభరాశిలో మహాలక్ష్మీ యోగం ఏర్పడబోతుంది. అంగారకుడి మరియు చంద్రుని కలయిక వల్ల ఈయోగం రూపొందుతుంది. దీని ప్రభావం అన్ని రాశులవారిపై ఉంటుంది. ముఖ్యంగా మూడు రాశులవారు ఈ యోగం వల్ల లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

సింహ రాశి
సింహ రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి యెుక్క కర్మల ఆధారంగా ఈ యోగం ఏర్పడబోతోంది. ఈసమయంలో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారుల మంచి లాభాలను గడిస్తారు. బిజినెస్ చేసేవారు పెద్ద పెద్ద ఆర్డర్ లను పొందే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీతో సంబంధాలు బాగుంటాయి. 
కన్య రాశిచక్రం
మహాలక్ష్మి రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. ఆగిపోయిన పని పూర్తవుతుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. 
మకరం
మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడటంతో మకర రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. ఎందుకంటే మీ రాశి నుండి ఐదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. 

Also Read: Budh Gochar 2023: రేపటి నుండి ఈరాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News