Saturday Remedies: శనివారం మహాకాల శని మృత్యుంజయ్ స్తోత్రం పఠించండి... శని దుష్ప్రభావాల నుంచి బయటపడండి!

Shani Dev: శనివారం నాడు మహాకాళ శని మృత్యుంజయ్ స్తోత్రాన్ని పఠించడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీని ప్రభావం వల్ల సడే సతి, ధైయా, శని దోషం, అకాల మృత్యువు నుండి విముక్తి పొందవచ్చు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 25, 2022, 09:47 AM IST
  • శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే
  • శనివారం శని మృత్యుంజయ మంత్రాన్ని పఠించండి
Saturday Remedies: శనివారం మహాకాల శని మృత్యుంజయ్ స్తోత్రం పఠించండి... శని దుష్ప్రభావాల నుంచి బయటపడండి!

Saturday Remedies: శనివారం నాడు కర్మ దాత అయిన శని దేవుడిని పూజిస్తారు. జాతకంలో సడేసతి, ధైయా, శని దోషాలు ఉన్నవారు... శని (Shani Dev) యొక్క దుష్ప్రభావాల నుంచి బయటపడాలంటే.. శనివారం నాడు మహాకాళ శని మృత్యుంజయ స్తోత్రాన్ని (Mahakal Shani Mrityunjay Mantra) పఠించాలి. దీనిని శనివారం లేదా ప్రతిరోజూ కూడా చేయవచ్చు. శనిదేవుడు సంతోషించి భక్తుల కోరికలు తీరుస్తాడు. 

శని మృత్యుంజయ్ స్తోత్రాన్ని పఠించడం వల్ల అకాల మృత్యు బాధను తగ్గించవచ్చు. శని మృత్యుంజయ స్తోత్రంలో 100 శ్లోకాలు ఉన్నాయి. మీరు వాటిని చదవడానికి కూర్చుంటే, అప్పుడు చాలా సమయం పడుతుంది. దీని కోసం మీరు ముందుగానే సమయాన్ని సెట్ చేసుకోవాలి. శ్లోకం మొత్తం సంస్కృతంలో ఉంటుంది. కొంతమందికి చదవడం కష్టంగా ఉండవచ్చు. పారాయణం చేసేటప్పుడు సరైన ఉచ్చారణ చేయాలి. అప్పుడే దాని ఫలం లభిస్తుంది.

శని మృత్యుంజయ స్తోత్రాన్ని పఠించే ముందు శని దేవుడిని పూజించాలి. శని దేవుడిని పద్ధతిగా పూజించండి. ఆ తర్వాత ఏకాంత లేదా ప్రశాంతమైన ప్రదేశంలో శని దేవుడిని ధ్యానించడం ద్వారా పఠించండి. మీరు మంత్రాలను జపించలేకపోతే, మీరు అర్హత కలిగిన పండిట్ లేదా జ్యోతిష్కుడి సహాయం తీసుకోవచ్చు.

Ashadha Amavasya 2022: ఆషాఢ అమావాస్య నాడు చేసే ఈ 7 పనులు... అపారమైన డబ్బును, ఆనందాన్ని ఇస్తాయి! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News