Jupiter Retrograde In October: జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాల కంటే బృహస్పతి గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం సంచారం, తిరోగమనం చేయడం వల్ల అన్ని రాశులవారిపై ఎంతో ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 9వ తేదిన సంపదకు అధిపతిగా భావించే ఈ బృహస్పతి గ్రహం వృషభ రాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. ఈ గ్రహం తిరోగమనంలో 2025 సంవత్సరం వరకు ఉంటుంది. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే బృహస్పతి వృషభరాశి నుంచి మిథున రాశిలోకి కూడా సంచారం చేస్తుంది. అయితే త్వరలోనే జరిగే ఈ తిరోగమన ప్రభావం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశులవారు అదృష్టాన్ని పొందడమే కాకుండా సులభంగా డబ్బులు కూడా పొందుతారు. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ధనుస్సు రాశి:
బృహస్పతి తిరోగమనం కారణంగా ఈ సమయంలో విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి జాతకంలో ఆరవ స్థానంలో ఈ తిరోగమనం జరగబోతోంది. దీని కారణంగా ఈ రాశివారికి అడుగడుగునా అదృష్టం లభించి డబ్బులు పొందుతారు. అంతేకాకుండా ఎలాంటి సమస్యలు ఉన్న సులభంగా పరిష్కారమవుతాయి. దీంతో పాటు కుటుంబ జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి. దీని కారణంగా జీవితంలో అనందం, శాంతి నెలకొంటుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. కెరీర్‌కి సంబంధించిన జీవితాల్లో కూడా అనేక మార్పులు వస్తాయి. ఆర్థిక పరమైన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశివారికి జాతకంలో 11వ స్థానంతో ఈ తిరోగమనం జరగబోతోంది. కాబట్టి వీరికి ప్రతి రంగంలో అనుకున్న ఫలితాలు కలగడమే కాకుండా సులభంగా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమతున్నవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశివారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్స్‌లు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ లభించి ఆనందంగా ఉంటారు. దీంతో పాటు విద్యార్థులు ఈ సమయంలో ఎలాంటి ప్రయత్నాలు చేసిన మంచి లాభాలు పొందుతారు. అలాగే వీరు విహార యాత్రలకు కూడా వెళ్లే ఛాన్స్‌లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మిథున రాశి:
ఈ తిరోగమనం కారణంగా మిథున రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు వీరికి 10 స్థానంలో తిరోగమనం జరుగుతుంది. దీని కారణంగా వీరికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త ఆదాయ వనరులు కూడా నెలకొంటాయి. డబ్బు సంబంధిత విషయాల్లో కూడా విపరీతమైన లాభాలు కలుగుతాయి. బ్యాలెన్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే ఖర్చులు కూడా విపరీతంగా తగ్గుతాయి. దీంతో పాటు వీరు ఈ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీరు కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి