Horoscope Today: నేడు ఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకోండి..

Horoscope Telugu: ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఎలా ఉందో జోతిష్య నిపుణులు తెలిపిన వివరాలు మీ కోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2021, 06:58 AM IST
Horoscope Today: నేడు ఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకోండి..

Horoscope prediction today: నేడు ఆదివారం (డిసెంబర్ 5). ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ముందుగా పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం
2021 డిసెంబర్​, 05 (ఆదివారం)
సూర్యోదయం ఉదయం 6:59 గంటలకు
సూర్యాస్తమయం సాయంత్రం 5:23 గంటలకు
తిథి- అమావాస్య మధ్యాహ్నం 01:15 వరకు
రాహుకాలం: ఉదయం 04:05 నుంచి మధ్యాహ్నం 05:23 వరకు 
దుర్ముహూర్తం: ఉదయం సాయంత్రం 4:00 నుంచి 04:42 వరకు
అమృతఘడియలు: ఉదయం 11:50 గంటల నుంచి మధ్యాహ్నం 04:05 గంటల వరకు

రాశి ఫలాలు..

మేష రాశి (Aries)

అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. అనవస విషయాల్లో తలదూర్చొద్దు. నిందలు పడే అవకాశముంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఖర్చులు చేస్తారు. ధాన, ధర్మాలు చేయడం మంచిది.

వృషభ రాశి (Taurus)

రుణాలు తీసుకునే విషయంలో ఈ రోజు మంచి జరిగే వీలుంది. మీ స్నేహితులు, దగ్గరి వారు మీకు మంచి సలహా ఇస్తారు. మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయలేకపోతారు. కుటంబంతో సరదాగా గడుపుతారు.

మిథున రాశి (Gemini)

నేడు మీకు పనిలో ఒత్తిడి ఉంటుంది. ఇంట్లో చికాకు తెప్పించే విషయాలు మీ ప్రశాంతతను పాడా చేస్తాయి. మదుపు విషయంలో జాగ్రత్త.  మీ పాత మిత్రులను కలుసుకోవడం ద్వార ఆహ్లాదంగా గడుపుతారు. వైవాహిక జీవితంల ఇబ్బందులు ఉన్నాయి.

కర్కాటక రాశి (Cancer)

ఏదైనా పని చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించడం అవసరం. ఇంట్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ శ్రీమతి విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలి. చెడు అలవాట్లను దూరం పెట్టడం ఉత్తమం.

సింహ రాశి (Leo)

ఆర్థికంగా కలిసి వస్తుంది. కొత్త ప్రాజెక్ట్​ల గురించి చర్చించేందుకు మంచి సమయం. మీకు ప్రియమైన వారితో గొడవలు ముగుస్తాయి. యోగా, ధ్యానం ద్వారా ప్రశాంతతను పెంచుకోవాలి.

కన్యా రాశి (Virgo)

అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు పెరిగే అవకాశముంది జాగ్రత్త. కొనుగోళ్లు జరిపే అవకాశం ఉంది. అనవసర విషయాల జోలికి వెళ్లొద్దు. విలాసాలకు పోకుండా జాగ్రత్త పాటించాలి.

తులా రాశి (Libra)

ఆరోగ్యం అనుకూలిస్తుంది. అయితే రోజంతా బిజీగా గడుస్తుంది. పెట్టుబడులు అంతగా కలిసి రావు. ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడతారు. ఉద్యోగం విషయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వైవాహిక జీవితం సానుకూలంగా ఉంది.

వృశ్చిక రాశి (Scorpio)

కుటంబంతో ఆహ్లాదంగా గడుపుతారు. ఖర్చులు భారీగా పెరుగుతాయి. ప్రేమికులకు మంచి రోజు. ఏదైన విషయాల్లో ప్రశాంతంగా ఆలోచించాలి. ఏదైనా గొడవ వల్ల మీ ప్రశాతంత చెడిపోవచ్చు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు.

ధనుస్సు రాశి (Sagittarius)

ఆరోగ్య పరంగా జాగ్రత్త అవసరం. కష్టమైనా.. అప్పులు చెల్లించాల్సి రావచ్చు. మీ కున్న సృజనాత్మకత వల్ల లాభపడే అవకాశాలున్నాయి. తగాదాలకు తావివ్వకండి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

మకర రాశి (Capricorn)

నిరాశ చెందకండి.  పెట్టుబడుల వైపు ఆోలచన చేయండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఫ్యామిలీ కోసం కొత్త పనులను ప్రారంభించేందుకు మంచి సమయం. అనవసర విషయాల వల్ల సమయం వృథా అవుతుంది. 

కుంభ రాశి (Aquarius)

ధనయోగం ఉంది. పాత బాకీలకు వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబం, బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. మానసికంగా ప్రశాంతతను పొందేందుకు ప్రయత్నించాలి. ధ్యానం చేయడం మేలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

మీన రాశి (Pices)

మహిళను నేడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్భినులు. ఈ రాశి వారి అప్పులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సరైన సమయంలో సహకారం అందుతుంది. కొత్త స్నేహాలను పొందగలిగే అవకాశాలున్నాయి.

Also read: సమస్యలతో సతమతం అవుతున్నారా..? జమ్మి చెట్టు ఇంట్లో నాటితే అన్ని కష్టాలు తొలగిపోతాయి

Also read: How to please lord Hanuman: హనుమంతుడిని ఇలా పూజిస్తే తప్పకుండా అనుగ్రహిస్తాడట

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News