Surya Grahan Dosh: భారత్‌లో ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం ఈ నెల 20న ఏర్పడబోతోంది. అయితే ఇదే క్రమంలో ఏప్రిల్ 14న సూర్యుడు మేష రాశిలో సంచారం చేశాడు. అదే రాశిలో సూర్యుడు, రాహువుల కలయిక ఏర్పడింది. కాబట్టి ఈ సూర్య గ్రహణం కారణంగా సూర్య-రాహు గ్రహణ దోషం ఏర్పడే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ దోషం ప్రభావం చాలా రాశులవారిపై పడే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సూర్య-రాహు గ్రహణ దోషం కారణంగా చాలా రాశులవారి జీవితాల్లో తీవ్ర దుష్ర్పభావాలు కలుగుతాయి. అయితే ఈ దోషం కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యగ్రహణం కారణంగా ఎలాంటి ప్రయోజనాలు పొందలేరని నిపుణులు చెబుతున్నారు. సూర్య-రాహువు గ్రహణ దోషం కారణంగా జన్మస్థలం జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టే ఛాన్స్ ఉంది. రాబోయే గ్రహణం కారణంగా ఏర్పడబోయే దోషం చాలా ప్రమాదకరమైనది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ దోషం నుంచి ఉపశమనం పొందొచ్చు. ఈ క్రమంలో సోమరితనం, ఆటంకం, పనిలో జాప్యం, నిరాశ, భావోద్వేగ వంటి సమస్యలు కలిగే అవకాశాలున్నాయి. అయితే సూర్యుడు-రాహువు గ్రహణ దోషం నుంచి ఒక ప్రత్యేక పరికరంతో బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ పరికరం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.
Also Read: Jio Cinema Charges: జియో సినిమాకు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే.. ఐపీఎల్ 203 మాత్రం..!
సూర్య గ్రహణం కారణంగా ఏర్పడబోయే దోషం నుంచి బయట పడడానికి తప్పకుండా సూర్య రాహు గ్రహణ దోష యంత్రాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఈ యంత్రం వినియోగించడం వల్ల ప్రతికూల ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ యంత్ర ప్రభావంతో రాహువు దోషం నశించే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అడ్డంకులు, దురదృష్టాల నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. దీని కారణంగా వ్యక్తికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలోని వృద్ధులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఈ క్రమంలో ఏర్పడే ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ దోష నివారణ యంత్రం హానికరమైన ప్రభావాలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషించడమేకాకుండా చాలా రకాల ప్రయోజనాలను చేకుర్చుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణలు చెబుతున్నారు. ఈ యంత్రాన్ని వినియోగించడమేకాకుండా 'ఓం నమః శివాయ' మంత్రాన్ని పఠించి, హనుమాన్ చాలీసాను చదవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సూర్య మంత్రం, ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు గాయత్రీ మంత్రం జపించడం వలన కూడా గ్రహణ దోషం దుష్ప్రభావం దూరమవుతుంది.
Also Read: Harry Brook Century: చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్రలో 'ఒకే ఒక్కడు'!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
First Solar Eclipse 2023: గ్రహణం కారణంగా సూర్య-రాహు దోషం, ఇలా చేశారో జీవితాంతం ఇబ్బందులే!