Dhanteras 2022 Puja Time: హిందువుల ముఖ్య పండుగలలో దీపావళి ఒకటి. ఈ ఏడాది ఈ ఫెస్టివల్ ను అక్టోబర్ 24న జరుపుకోనున్నారు. అయితే ఈ పండుగకు ఒక రోజు మందు వచ్చే వేడుకను ధంతేరాస్ అంటారు. అంటే ధంతేరాస్ (ధనత్రయోదశి) ఫెస్టివల్ అక్టోబరు 23న వస్తుందన్న మాట. ధనత్రయోదశి (Dhanteras 2022) రోజున బంగారం, వెండి, కారు, ఇల్లు, వస్తువులు మెుదలైన వాటిని కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాకుండా ఈరోజున దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అయితే ధంతేరాస్ రోజున ఏయే వస్తువులను దానం చేస్తారో తెలుసుకుందాం.
ఈ వస్తువులను దానం చేయండి..
ధాన్యం- ధంతేరాస్ రోజున ధాన్యాన్ని దానం చేసిన వారు శుభఫలితాలను పొందుతారు. వారికి ఇంట్లో ఎప్పుడు ఆహార ధాన్యాలకు కొరత ఉండదు. దీంతోపాటు ఈ రోజు వీలైతే పేదలకు ఆహారం పెట్టండి. అనంతరం దక్షిణ ఇవ్వడం వల్ల మీకు శుభం జరుగుతుంది.
ఇనుము- ధనత్రయోదశి రోజున ఇనుము దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున ఇనుమును దానం చేయడం వల్ల మీ లైఫ్ లో అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతారు. అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
చీపురు- ధంతేరస్ రోజున చీపురు కొనడం, దానం చేయడం పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున గుడికి లేదా పేదవారికి చీపురు దానం చేస్తే జీవితంలో డబ్బుకు లోటు ఉండదు.
వస్త్రాలు- ఈ రోజున వస్త్రదానం చేయడం కూడా మంచిది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పేదవారికి వస్త్రదానం చేయడం ద్వారా డబ్బు మరియు ధాన్యాలకు లోటు ఉండదు. దీనితో పాటు ఆ వ్యక్తి అప్పుల నుండి బయటపడతాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook