Benefits of Budhaditya Rajyog: ఆస్ట్రాలజీలో సూర్యుడిని గ్రహాల రాజుగా, బుధుడిని గ్రహాల యువరాజుగా పిలుస్తారు. రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిస్తే దాని యుతి లేదా సంయోగం అంటారు. ప్రస్తుతం బుధుడు, సూర్యుడు మిథునరాశిలో సంచరిస్తున్నాయి. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రంలో బుధాదిత్య యోగం చాలా పవిత్రమైనదిగా పేర్కొంటారు. ఈ యోగం 4 రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
మేషం
బుధాదిత్య రాజయోగం మేష రాశి వారికి సంతోషాన్ని ఇస్తుంది. ఆఫీసులో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీ ప్రేమ లేదా వైవాహిక జీవితం బాగుంటుంది. వ్యాపారులు ఈ సమయం బాగుంటుంది.
వృషభం
వృషభ రాశి వారికి రెండు గ్రహాల కలయిక చాలా మేలు చేయనుంది. ఉద్యోగులు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా పొందే అవకాశం ఉంది. మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. అంతేకాకుండా మీ బిజినెస్ పెరుగుతుంది.
మిధునరాశి
మిథునరాశి వారికి బుధాదిత్య రాజయోగం అనుకూలంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఉద్యోగం మారడానికి ఇదే మంచి సమయం. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీరు కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ఫారిన్ ట్రిప్ కు వెళ్లే అవకాశం ఉంది.
Also Read: Budh Uday 2023: మిథున రాశిలో ఉదయించిన బుధుడు.. ఈ 3 రాశులవారు ధనవంతులవ్వడం పక్కా...
ధనుస్సు రాశి
సూర్యుడు మరియు బుధుల కలయిక ధనుస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. మీ బిజినెస్ విస్తరిస్తుంది కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి కోరిక నెరవేరుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Surya Grahan 2023: త్వరలోనే రెండో సూర్యగ్రహణం.. ఈ రాశులపై ప్రతికూల ప్రభావం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook