Budh Gochar 2023: గ్రహాల రాకుమారుడైన బుధుడు జనవరి 13, 2023న ధనుస్సు రాశిలో ఉదయించనున్నాడు. ప్రస్తుతం బుధుడు అస్తమించే దశలో ఉన్నాడు. గత ఏడాది డిసెంబరు 31న మెర్క్యూరీ ధనుస్సు రాశిలో తిరోగమనం చేశాడు. అనంతరం జనవరి 2న బుధదేవుడు ధనుస్సు రాశిలో అస్తమించాడు. బుధుడి ఉదయించడం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
కర్కాటకం (Cancer): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధగ్రహ సంచారం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో మీరు రాణిస్తారు.
వృశ్చిక రాశి (Scorpio): ఈ రాశి వారికి బుధుడు ఎనిమిది మరియు పదకొండవ ఇంటికి అధిపతి. వృశ్చిక రాశి వారి జాతకంలో రెండవ ఇంట్లో బుధుడు ఉదయించనున్నాడు. మీరు వ్యాపారంలో చేసిన కృషికి మంచి ఫలితాలను పొందుతారు. మీరు మీ బిజినెస్ ను విస్తరించే అవకాశం ఉంది. ఆర్థికంగా మీరు లాభపడే అవకాశం ఉంది.
మీనం (Pisces): మీన రాశి వారికి బుధుడు నాల్గవ మరియు ఏడవ ఇంటికి అధిపతి. మీన రాశి వారి జాతకంలో పదో స్థానంలో బుధుడు ఉదయిస్తాడు. కెరీర్‌లో కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. మీ ప్రొఫెషనల్ జీవితం బాగుంటుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఫ్యామిలీ సపోర్టు మీకు లభిస్తుంది.
Also Read: Saturn Dhaiya 2023: మరో 8 రోజుల్లో కుంభంలోకి శనిదేవుడు.. ఈ రాశులకు శని పీడ నుండి విముక్తి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.