Agni Panchak Nov-Dec 2022: అగ్ని పంచకము ప్రారంభం.. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాల్సిందే.. లేకపోతే అంతే సంగతి..

Agni Panchak Nov-Dec 2022: పంకము కాలం మనవుని జీవితంలో చాలా రకాల దుష్ప్రభావాలను కలిగించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా దీని వల్ల చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2022, 11:49 AM IST
Agni Panchak Nov-Dec 2022: అగ్ని పంచకము ప్రారంభం.. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాల్సిందే.. లేకపోతే అంతే సంగతి..

Agni Panchak Nov-Dec 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అశుభ సమయంలో చేసిన ఏ పనైనా తగిన ఫలితాన్ని ఇవ్వదని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇది శుభప్రదమైనది కాదని కూడా జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. పంచకము కాలంలో ఎలాంటి పనులు చేసిన అది దుష్ప్రభావాలకు దారి తీసే అవకాశాలున్నాయి. పంచకం ప్రతి నెలలో ఒక సారి వస్తుంది. ఈ క్రమంతో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా శుభ పనులు చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రతిసారీ పంచకం వివిధ రకాలుగా ఉంటుంది. అయితే ఈ సారి అగ్ని సంబంధించిన పంచకము వచ్చింది. ఈ పంచకము నిన్నటి నుంచి ప్రారంభమైంది. దీని ప్రభావం 04 డిసెంబర్ 2022న వరకు ఉండే అవకాశాలున్నాయి. అయితే దీని వల్ల కలిగే దుష్ప్రబావాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పంకము అంటే ఏమిటి?:
ఈ పంకము ఆదివారం ప్రారంభమయ్యే ఆశుభ గడియలు. దీని ప్రభావం వల్ల ఈ ఐదు రోజులు శారీరక, మానసిక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

రాజ్ పంచకము:
సోమవారం ప్రారంభమయ్యే పంచకాన్ని రాజ్ పంచక్ అంటారు. ఈ పంచకం శుభప్రదంగా జోతిష్య శాస్త్ర నిపుణులు పరిగణిస్తారు. దీని ప్రభావం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పని చేసే వారు మంచి లాభాలు పొందుతారు.

అగ్ని పంచకము:
మంగళవారం ప్రారంభమయ్యే పంచకాన్ని అగ్ని పంచక్ అంటారు. దీని ప్రభావం కూడా ఐదు రోజులు ఉంటుంది. ముఖ్యంగా న్యాయస్థానం, వివాదాలు వంటి ఆగిపోయిన పనులుంటే సులభంగా తీరిపోతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో నిర్మాణ పనులు, ఉపకరణాలు వంటి పనులు చేయడం మంచిది కాదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

మృత్యు పంచకము:
శనివారం ప్రారంభమయ్యే పంచకాన్ని మృత్యు పంచక్ అంటారు. ఇది మానవులకు దుష్ప్రభావాలను కలిగించేదిగా జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఐదు రోజుల్లో ఎలాంటి రిస్క్‌ పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో పలు రాశువారు వివాదాలు, గాయాలు, ప్రమాదం మొదలైన ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Also Read: 'శ్రద్ధ'ను పోలిన మర్డర్ కేసు నిందితులను పట్టించిన మొబైల్ ఫోన్.. ఇంత ఈజీగా దొరికేశారా

Also Read: శ్రద్ధ'పై అనుమానమే ఇంతదాకా తెచ్చిందా..వేరే వాళ్లతో వెళుతుందనే ఇలా.. కొత్త కోణం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News