Pinarayi Vijayan: ఒక మహిళ డ్రైవింగ్ వలన ముఖ్యమంత్రి రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. సడన్‌గా అవతలి రోడ్డుకు మహిళ టర్న్ తిప్పుకోవడంతో వెంట వస్తున్న సీఎం కాన్వాయ్ ఒక్కసారిగా ఆమెను తప్పించబోయి కాన్వాయ్ డ్రైవర్ బ్రేక్ వేయగా.. వెనుకాల వస్తున్న వాహనాలన్నీ ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ముఖ్యమంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు. కాగా ప్రమాదంలో ఆరు వాహనాలు దెబ్బతినగా.. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది.
Also Read: Liquor Lorry: రోడ్డుపై ఫుల్ లోడ్ మద్యం లారీ బోల్తా.. సీసాలకు సీసాలు లూటీ
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువనంతపురంలోని వామనపురంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ పర్యటిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆ మార్గంలో రోడ్డుపై వెళ్తుండగా స్కూటీపై వెళ్తున్న మహిళ అకస్మాత్తుగా కుడి వైపునకు తిరిగింది. అయితే ఆమె వెనుకాలే వస్తున్న సీఎం కాన్వాయ్ ఇది గ్రహించి వెంటనే సడన్ బ్రేక్ వేశారు. ఆమెను తప్పించబోయి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకాల కాన్వాయ్‌లో ఉన్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
Also Read: Water Supply: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. 24 గంటలు నీటి సరఫరా బంద్
వరుసగా ఆరు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. అయితే కాన్వాయ్‌లో ఉన్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాత్రం సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంలో ఎస్కార్ట్ కారు ముందు భాగం.. అంబులెన్స్‌తోపాటు మిగతా కార్లు ధ్వంసమయ్యాయి. దెబ్బతిన్న కార్లను వదిలేసి ముఖ్యమంత్రిని ముందుకు వెళ్లనిచ్చారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రమాదం సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.
ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉంది. ఒక మహిళ చేసిన పనికి ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రమాదానికి గురైందని విషయం తెలుసుకుని నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియోను నెటిజన్లు భిన్న రీతుల్లో స్పందిస్తున్నారు. కాగా పినరయి విజయన్ తన కాన్వాయ్ వెళ్లేప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వాహనాలను ఆపడం అనే పని చేయడం లేదు. ఈ క్రమంలోనే తాజా సంఘటన చోటుచేసుకుంది. దీంతో మళ్లీ సీఎం కాన్వాయ్ వెళ్లేప్పుడు ప్రజలను ఆపే ప్రక్రియను పునఃప్రారంభిస్తారని తెలుస్తోంది.
#KeralaCM Pinarayi Vijayan's Convoy collided with one another.
Cm's vehicle had minor damage but he was not injured in the accident. collision happened due to a woman in scooty attempted to make a right turn suddenly, no one injured #Kerala pic.twitter.com/4Al0RCsol3
— Crazziee Stuff (@crazziee_stuff) October 28, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter