Snake Hunter Kisses Black King Cobra Like his Girl Friend: ఒక్క కాటులో మనిషిని చంపే శక్తి ఉన్న పాములు ఈ భూప్రపంచంలో చాలా ఉన్నాయి. అందుకే పాములంటే చాలా మంది హడలిపోతారు. అత్యంత విషపూరిత పాములలో కింగ్ కోబ్రా ముందువరసలో ఉంటుంది. ఇది కాటేసే సమయంలో ఎక్కువ విషాన్ని చిమ్ముతుంది కాబట్టి.. ప్రతి ఒకరు వీటికి చాలా దూరంగా ఉంటారు. అయితే ఈ భూప్రపంచంలో పాములను అమితంగా ఇష్టపడే వారు కూడా ఉంటారు. వారికి పాములంటే అస్సలు భయం ఉండదు. వాటిని చాలా సులువుగా పట్టేస్తుంటారు. ఇందుకు సంబందించిన వీడియోలు చాలానే నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి.
ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను చుడడానికే భయం వేస్తుంది. ఇక అది ఎదురుపడితే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ ఓ వ్యక్తి ఏకంగా దానిని ముద్దుపెట్టుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం.. ఓ స్నేక్ హంటర్ రెండు బ్లాక్ కింగ్ కోబ్రాలను సంచిలోంచి బయటకు తీస్తాడు. అవి రెండు కాసేపు పోట్లాడుకుంటాయి. ఓ పాము మరో పామును కాటేస్తుంది. అవి రెండు పారిపోవడానికి ప్రయతించగా.. ఓ పామును పట్టుకుని సంచిలో బంధిస్తాడు.
బ్లాక్ కింగ్ కోబ్రాతో స్నేక్ హంటర్ ఆడుకుంటాడు. అది కాటేయడానికి దూసుకొచ్చినా వెనక్కి తగ్గకుండా తప్పించుకుంటాడు. చాలా సమయం తర్వాత దాన్ని తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు. ఆపై పడగ విప్పిన కింగ్ కోబ్రా ముందు నెమ్మదిగా తన తలను తీసుకొస్తాడు. ఆపై బ్లాక్ కింగ్ కోబ్రా తలపై ముద్దుపెట్టుకున్నాడు. అనంతరం స్నేక్ హంటర్ తన తలను కింగ్ కోబ్రా తలపై గుద్దుతాడు. చివరకు దాన్ని పట్టుకుని సంచిలో వేస్తాడు.
బ్లాక్ కింగ్ కోబ్రాను స్నేక్ హంటర్ ముద్దుపెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో 'PAMBOYZ OFFICIAL' అనే యూట్యూబ్ ఛానెల్లో ఉంది. ఈ వీడీయో సంవత్సరం క్రితందే అయినా ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియోకి నెట్టింట కామెంట్ల, లైకుల వర్షం కురుస్తుంది. 'అచ్చు అమ్మాయికి పెట్టినట్టే కిస్ చేశాడు', 'నీకు పెద్ద దండంరా సామీ' అంటూ వీడియో చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి