King Cobra Catching Video: స్నేక్ క్యాచర్ ను ఓ ఆట ఆడించిన 22 అడుగుల కింగ్ కోబ్రా.. చివరికి ఏం జరిగిందో తెలుసా..?

Huge King Cobra Viral Video: ప్రముఖ స్నేక్ క్యాచర్ జయ కుమార్ ఓ పామును బంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోలో గమనిస్తే ఆయన భారీ కింగ్ కోబ్రా ను పట్టుకోవడం చూసి నేటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. మీరు కూడా ఈ వీడియోని ఒకసారి చూడండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 7, 2023, 07:03 PM IST
King Cobra Catching Video: స్నేక్ క్యాచర్ ను ఓ ఆట ఆడించిన 22 అడుగుల కింగ్ కోబ్రా.. చివరికి ఏం జరిగిందో తెలుసా..?

22 Feet Huge King Cobra Viral Video: పాములు ఎంత ప్రమాదకరమైనవో అందరికీ తెలిసిందే.. అయితే భూమి మీద రెండు జాతుల పాములు కలిగి ఉన్నాయి.. ఈ జాతుల్లో కొన్ని విషపూరితమైతే.. మరికొన్ని సాధారణమైనవి. ప్రస్తుతం భూమి మీద విషపూరితమైన పాములే అధికంగా ఉంటాయి. పాములు చాలా వరకు అటవీ ప్రాంతంలో ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. వాతావరణంలో కాలుష్యం ఏర్పడడం కారణంగా అడవులు తగ్గిపోవడం వల్ల ఆహారం కోసం జనసంచారంలోకి వస్తున్నాయి.

చాలావరకు జనసంచారాల్లోకి వచ్చిన పాములను స్నేక్ క్యాచర్స్ తమ వంతు సహాయంగా పాములను పట్టుకొని సురక్షిత ప్రదేశాల్లో వదిలిపెడుతున్నారు. ఈ పట్టుకునే క్రమంలో వీడియోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలే తెగ ట్రెండింగ్ గా మారుతున్నాయి. ఇటీవలే ఓ స్నేక్ క్యాచర్ పామును పట్టిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇక వీడియో విషయానికొస్తే.. ఓ భారీ కింగ్ కోబ్రా జనసంచారాల్లోకి ప్రవేశిస్తుంది. అయితే దీనిని గమనించిన స్థానికులు ప్రముఖ స్నేక్ క్యాచర్ జయ కుమార్ సమాచారం అందించగా ఆయన అక్కడికి చేరుకుంటాడు. పాము సంచరించిన ప్రదేశాన్ని జయకుమార్ బృందం కోబ్రా కోసం గాలిస్తుంది. ఇలా వెతుకుతున్న క్రమంలో ఎండిన కట్టెల్లో ఆ భారీ కింగ్ కోబ్రా సంచారం చేయడం చూసి స్నేక్ క్యాచర్ తోకతో బయటికి లాగేందుకు ప్రయత్నిస్తాడు. ఇలా ప్రయత్నించే క్రమంలో జయ కుమార్ చేతిలో నుంచి పాము తప్పించుకుంటుంది.

ఇలా తప్పించుకున్న తర్వాత బృందం మళ్ళీ వెతకడం ప్రారంభిస్తుంది. అయితే ఆ భారీ కింగ్ కోబ్రా అదే కట్టెల్లో ఉన్నట్టు గమనించి.. కట్టెలను బయటికి లాగేస్తారు. ఇదే క్రమంలో వారికి పాము మళ్లీ కనిపిస్తుంది. ఆ తర్వాత జయకుమార్ ఆ పాముతో కను మళ్ళీ పట్టుకుని బయటికి లాగుతాడు. తోకను పట్టుకొని తన వెంట తెచ్చుకున్న కాటన్ సంచిలో పామును బంధిస్తాడు. 

Also Read: ENG Vs IRE: బ్యాట్ టచ్ చేయకుండా.. బాల్ ముట్టకుండా.. బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు

ఇదే క్రమంలో స్నేక్ క్యాచర్ జయ కుమార్ వీడియో ద్వారా ఇలా తెలియజేశాడు.. పాములు సాధారణంగా మంచివేనని వీటివల్ల ప్రకృతికి చాలా లాభాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఎలకల దాడి నుంచి పంటలను రక్షించేందుకు పాములు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కాకపోతే కొన్ని పాముల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. 

చిత్తడిగా ఉన్న ప్రదేశాల్లో తప్పకుండా షూ లేదా చెప్పులను ధరించి వెళ్లాలని సూచించారు. అంతేకాకుండా పాములు ఇళ్లలోకి సంచరించినప్పుడు చంపకుండా అడవి శాఖా సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. పాములను రక్షించేందుకు ఎంతటి రిస్క్ అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 

Also Read: ENG Vs IRE: బ్యాట్ టచ్ చేయకుండా.. బాల్ ముట్టకుండా.. బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News