Jogi Caught Black Cobra: పాము కాటేసిన వదలకుండా ఒంటి చేతితో పట్టేసిన జోగి.. హేట్సాఫ్

Black Cobra Caught by Jogi: జోగి బూర ఊదుతూ నాగుపామును పట్టుకునేందుకు ప్రయత్నించినా.. అది  కాటేస్తుంది. అయినా కూడా వెనకడుగు వేయని జోగి పామును పెట్టేస్తాడు..

Written by - P Sampath Kumar | Last Updated : Mar 22, 2023, 07:37 AM IST
  • నాగుపాము కాటేసినా కూడా పట్టించుకోకుండా
  • రైతుల రక్షణ కోసం పట్టుకున్న జోగి
  • వీడియో చూస్తే మెంటలెక్కటం ఖాయం
Jogi Caught Black Cobra: పాము కాటేసిన వదలకుండా ఒంటి చేతితో పట్టేసిన జోగి.. హేట్సాఫ్

Jogi Caught Black Cobra After Bites 2 Times: నాగుపాము లేదా త్రాచుపాము గురించి మనందరికి తెలిసిందే. భారతదేశానికి చెందిన విషం కలిగిన పాములలో ఇది ముందువరుసలో ఉంటుంది. నాగు పాము పడగ విప్పి భయపెట్టటంతో ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. పడగ వెనక వైపు రెండు అండాకార గుర్తులు.. ఒక వంపు గీతతో కలుపబడి ఉంటాయి. అదే మనకు కళ్ళ జోడును గుర్తుకుతెస్తాయి. నాగుపాము ఒక మీటరు దాకా పొడవు ఉంటుంది. అరుదుగా మాత్రమే రెండు మీటర్ల (ఆరు అడుగులు) పాము కనిపిస్తుంది. నాగుపాము విషం చాలా ప్రమాదకరమైంది. ఇది కాటేస్తే మనిషి బ్రతకడం చాలా కష్టం. 

నాగుపాములకు అంత పేరు రావటానికి కారణం.. పాములు ఆడించే వారికి అవి బాగా ఇష్టమైనవి కావటం. నాగుపాము పడగ విప్పి పాముల వాడి (జోగి) నాదస్వరానికి అనుగుణంగా ఆడటం చూడటానికి ఎంతో బాగుంటుంది. వెదురు బుట్టలో నాగుపాములతో తిరిగే పాముల వాళ్ళు భారతదేశంలో నిత్యం కనిపిస్తుంటారు. అయితే నాగుపాము చెవిటిదన్న విషయం చాలా మందికి తెలియదు. పాములవాడి నాదస్వరం కదలికలు, అతని కాళ్ళతో భూమిని తడుతుంటే వచ్చే ప్రకంపనలను గ్రహించి నాగుపాము ఆడుతుంటుంది.

నాగుపాములను ఆడించే వారు పొలాల మధ్య లేదా అడవుల్లో వాటిని పడుతుంటారు. పట్టే క్రమంలో అవి కాటేసినా వెనకడుగు వేయరు. ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం.. జోగినులు కొందరు నాగుపాములను పట్టేందుకు పొలాలల్లో తిరుగుతుంటారు. బూర ఊదుతూ తిరుగుతుండగా వారికి ఓ పొదల్లో రెండు పాములు కనిపిస్తాయి. చిన్న పామును సులువుగా పట్టిన జోగి.. పెద్ద పాము పడగ విప్పడంతో పట్టలేకపోతాడు. బూర ఊదుతూ దాన్ని కంట్రోల్ చేసినా.. పట్టుకునేటప్పుడు కాటేయబోతోంది..

పక్కన ఉన్న మరో ఇద్దరు జోగినులు అతడికి చికిత్స చేస్తారు. అనంతరం రైతుల రక్షణ కోసం బూర ఊదుతూ నాగుపామును పట్టుకునేందుకు ప్రయత్నించినా.. అది మరోసారి కాటేస్తుంది. అయినా కూడా వెనకడుగు వేయని అతడు పామును పెట్టేస్తాడు. ఇందుకు సంబందించిన వీడియో 'King Cobra Tv' అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో 6 నెలల క్రితందే అయినా ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. 

Also Read: 30 Heavy Feet King Cobra: స్నేక్ క్యాచర్లను ఒక ఆటాడుకున్న 30 అడుగుల కింగ్ కోబ్రా.. చివరకి ఏం జరిగిందంటే..?

Also Read: 22 Feet King Cobra: బాప్రే.. వణికిస్తున్న 22 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 5 గురు మోసిన వైనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News