Ageing Problem: సదా యౌవనంగా ఉండాలంటే ఈ అలవాట్లు వదిలేయండి

ఇటీవలి కాలంలో తక్కువ వయస్సులోనే వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తుంటాయి. చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య అధికంగా ఉంటుంది. ముఖంపై ముడతలు, పింపుల్స్, చర్మ వదులవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే కొన్ని అలవాట్లు లేదా ఆహార పదార్ధాలకు దూరం పాటిస్తే కచ్తితంగా ఏజీయింగ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు

Ageing Problem: ఇటీవలి కాలంలో తక్కువ వయస్సులోనే వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తుంటాయి. చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య అధికంగా ఉంటుంది. ముఖంపై ముడతలు, పింపుల్స్, చర్మ వదులవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే కొన్ని అలవాట్లు లేదా ఆహార పదార్ధాలకు దూరం పాటిస్తే కచ్తితంగా ఏజీయింగ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు
 

1 /5

ఆకు కూరలు చర్మాన్ని దీర్ఘకాలం యౌవనంగా, మృుదువుగా, తాజాగా ఉంచాలంటే డైట్ మార్చుకోవాలి. డైట్‌లో ఎక్కువగా ఆకు కూరలు, కూరగాయలు ఉండాలి. పండ్లు ఎక్కువగా తినాలి. 

2 /5

ఫ్రైడ్ ఆయిలీ పదార్ధాలు చాలామంది ఫ్రైడ్ ఆయిలీ పదార్ధాలంటే ఇష్టపడుతుంటారు. కానీ వీటి వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. చర్మం నిగారింపు కోల్పోతుంది

3 /5

టీ - కాఫీ టీ- కాఫీ ఎక్కువగా తాగేవారిలో చర్మం నిర్జీవంగా ఉంటుంది. ఫలితంగా ముఖంపై ముడతలు ఏర్పడుతాయి. నిర్ణీత వయస్సు కంటే ముందే ఈ సమస్య వస్తుంది. అందుకే ఈ అలవాటు మానేయాలి

4 /5

చక్కెర పదార్ధాలు చక్కెర పదార్ధాలు తినడం శరీరానికి మంచిది కాదు. చర్మం నిర్జీవంగా మారుతుంది. ముఖంపై ముడతలు ఏర్పడతాయి. కూల్ డ్రింక్స్, స్వీట్స్, చాకోలేట్స్ వంటి పదార్ధాలకు దూరంగా ఉండాలి. వీటిని మానేస్తే చర్మం యౌవనంగా ఉంటుంది. 

5 /5

మద్యపానం మద్యపానం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కొందరైతే అదే పనిగా మద్యం సేవిస్తుంటారు. దీనివల్ల చాలా సమస్యలు ఎదురౌతాయి. మద్యపానం ఎక్కువైతే తక్కువ వయస్సులోనే వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తాయి. మద్యపానం చర్మాన్ని డీ హైడ్రేట్ చేస్తుంది. ముడతలు ఏర్పడతాయి.