Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌.. మే నెల దర్శనం టిక్కెట్లు, గదులను వెంటనే బుక్‌ చేసుకోండి..

Tirumala 2025 May Quota Tickets Release: తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనార్థం నిత్యం లక్షల మంది భక్తులు కోరుకుంటారు. శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. 2025 మే నెల కు సంబంధించిన రూ. 300 ఇతర ప్రత్యేక దర్శనం టికెట్ల బుకింగ్ ప్రారంభించనుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం
 

1 /5

 2025 మే నెల కు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లు, తోమాల అష్టాదళ పాద పద్మ ఆరాధన ఇతర సేవలకు సంబంధించిన మే నెల కోటాను ఈనెల ఫిబ్రవరి 18వ తేదీన విడుదల చేయనుంది. ఉదయం 10 గంటల నుంచి ఈ టోకెన్లు అందుబాటులో ఉండనున్నాయి. ఆసక్తి ఉన్న భక్తులు వెంటనే టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.  

2 /5

 ఫిబ్రవరి 18 నుంచి 20 తేదిలోపు సేవా టికెట్లను రిజిస్టర్ చేసుకోవాలి. దీనికి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. లక్కీ డిప్‌లో ఎంపికైన వారికి మాత్రమే ఈ టోకెన్లు మంజూరు చేస్తారు.  ప్రధానంగా శ్రీవారి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఉంజాల్‌ సేవా, సహస్రదీపారాధన టోకెన్లను ఫిబ్రవరి 21 తేదీన ప్రారంభించనున్నారు.  

3 /5

 ఫిబ్రవరి 22వ తేదీ శ్రీవాణి ట్రస్టు టికెట్ల మే నెలకు సంబంధించిన కోటాను విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం దివ్యాంగులు, వృద్ధులకు సంబంధించిన టోకెన్లను విడుదల చేయనున్నారు. ఇక ఫిబ్రవరి 24వ తేదీ ప్రత్యేక దర్శనం రూ. 300 టోకెన్లను జారీ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో వసతి గదుల బుకింగ్ కూడా మొదలవుతుంది.  

4 /5

టికెట్లను బుక్ చేసుకునే భక్తులు ttddevsthan.ap.gov.in అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలి. మే నెలకు సంబంధించిన కోటాను  ఫిబ్రవరి 18 నుంచి 24వ తేదీ వరకు ఈ టికెట్లు అందుబాటులో ఉంచనుంది తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం.  

5 /5

అయితే ప్రత్యేక దర్శనం టిక్కెట్లు దొరకని భక్తులు ఇతర టూరిజం డిపార్ట్‌మెంట్ల వద్ద దర్శనం టోకెన్లు కొనుగోలు చేసేవారు. అయితే, బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే సమాచారంతో టీటీడీ ఇకపై ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ టికెట్లను విక్రయించనుంది. దీనికి సంబంధించిన త్వరలోనే అప్డేట్‌ రానుంది.