Best Morning Habits: రోజూ ఉదయం లేచిన వెంటనే ఇలా చేస్తే ఊహించని ఆరోగ్యం మీ సొంతం

Best Morning Habits: ఇటీవలి కాలంలో జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఆరోగ్యం అనేది చాలా సమస్యగా మారింది. దీనికి ప్రధాన కారణం ఇమ్యూనిటీ లోపించడం. అయితే కొన్ని రకాల అలవాట్లు మార్చుకుంటే ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు. వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. 

Best Morning Habits: ఆయుర్వేదం ప్రకారం మీరు పాటించాల్సిన అలవాట్లలో శరీరం డీటాక్స్ చేయడం ముఖ్యమైంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాల్సిన 5 కీలకమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం.
 

1 /5

ప్రాణాయామం ప్రాణాయామం ఆయుర్వేదంలో అత్యంత కీలకమైంది. మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఉదయం వేళ అనులోమ, విలోమ ప్రక్రియతో బ్రీతింగ్ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల లంగ్స్‌లో విష పదార్ధాలు బయటకు పోతాయి. మెదడుకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. 

2 /5

టంగ్ క్లీనింగ్ ఆయుర్వేదం ప్రకారం టంగ్ క్లీనింగ్ చాలా ముఖ్యమైంది. రాత్రంతా నాలుకపై పేరుకున్న విష పదార్ధాలు తొలగించవచ్చు. నోట్లో బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో విష పదార్ధాలు పేరుకుపోకుండా ఉంటుంది

3 /5

చన్నీళ్లతో ముఖం, కళ్లు కడగడం ఉదయం లేవగానే చన్నీళ్లతో ముఖం, కళ్లు శుభ్రం చేసుకోవాలి. ఈ ప్రక్రియ ద్వారా కొన్ని రకాల విష పదార్ధాలు బయటకు పోతాయి. పంచేంద్రియాలకు దోహదమౌతుంది. ఆయుర్వేదంలో ముఖానికి త్రిఫలం లేదా రోజ్ వాటర్‌తో శుభ్రం చేయడం మంచిది. 

4 /5

తెల్లవారుజాము లేవడం ఆయుర్వేదం ప్రకారం సూర్యోదయం కంటే ముందు అంటే ఉదయం 4.30-6 గంటల మధ్య నిద్ర లేవాలి. ఈ సమయంలో అత్యంత తాజాగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. రోజూ త్వరగా నిద్ర లేవడం వల్ల రోజంతా ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. 

5 /5

ప్రాణాయామం ప్రాణాయామం ఆయుర్వేదంలో అత్యంత కీలకమైంది. మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఉదయం వేళ అనులోమ, విలోమ ప్రక్రియతో బ్రీతింగ్ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల లంగ్స్‌లో విష పదార్ధాలు బయటకు పోతాయి. మెదడుకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది.