Happy Teachers Day 2024: "ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు" ఇలా చెప్పితే మీ టీచర్స్‌ ఫిదా అవుతారు!

Teachers Day Wishes: టీచర్స్‌ డే అనేది ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయుల కృషికి గుర్తుగా జరుపుకునే ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతారు. అయితే మీరు కూడా ఇలా అద్భుతంగా మీ టీచర్స్‌కు కృతజ్ఞతలు చెప్పండి.
 

Teachers Day Wishes: ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జరుపుకునే ఈ రోజు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరైన ఉపాధ్యాయులను ఘనంగా నివాళి అర్పించే రోజు. ఉపాధ్యాయులు మనకు కేవలం పాఠాలు మాత్రమే నేర్పరు. జీవితం గురించి, విలువలు గురించి, సమాజం గురించి కూడా బోధిస్తారు. వారి శ్రమకు గుర్తుగా ఈ రోజును జరుపుకోవడం చాలా ముఖ్యం.  అంతేకాకుండా భారతదేశంలో టీచర్స్‌ డేను సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిగా జరుపుకుంటారు. ఆయన భారతదేశ రెండవ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, ఉపాధ్యాయుడు. ఆయన విద్యార్థుల కల్యాణం కోసం ఎల్లప్పుడూ కృషి చేసేవారు. అందుకే ఆయన జయంతిని టీచర్స్‌ డేగా జరుపుకోవడం ప్రారంభించారు.

1 /6

నా ఎదుగుదలనే గురుదక్షిణగా భావించే నా ప్రియమైన గురువుగారికి..2024 టీచర్స్‌ డే శుభాకాంక్షలు

2 /6

 జీవితంలో వచ్చే ప్రతి చీకటిలో వెలుగు చూపేది గురువు 2024 ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

3 /6

బడి, బాధ్యత, భవిష్యత్తుని పరిచయం చేసిన మా గురువులందరికీ  టీచర్స్‌ డే శుభాకాంక్షలు

4 /6

ఎగిరి గాలిపటం విధ్యార్థి అయితే.. ఆధారమైన దారం గురువు.. హ్యపీ టీచర్స్‌ డే శుభాకాంక్షలు 

5 /6

ఈ ప్రపంచానికి మీరు కేవలం గురువులే కావచ్చు. మాకు మాత్రం మీరే మా కథానాయకులు.. 2024 ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు

6 /6

 విద్యార్థి జీవితాన్ని మలిచేది గురువే...2024 టీచర్స్‌ డే  శుభాకాంక్షలు..