Sun transits Effect 2025: అన్ని గ్రహాలకు సూర్యుడు అధిపతిగా వ్యహరిస్తాడు. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని ఆత్మ, గౌరవంతో పాటు స్థానం, శక్తికి సూచికగా భావిస్తారు. కాబట్టి సూర్యుడు ఎప్పుడు రాశి సంచారం చేసిన వ్యక్తిగత జీవితాల్లో అనేక మార్పులు సంభవిస్తాయి. అయితే ఈ సూర్యుడు సింహరాశిని పాలిస్తాడు.
సూర్యుడు ప్రతి 30 రోజులకు ఒకసారి రాశి సంచారం చేస్తాడు. ఈ గ్రహం మొత్తం 12 రాశుల్లో 30 రోజుల పాటు ఉంటుంది. అయితే ఈ గ్రహం అప్పుడప్పుడు నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. దీని కారణంగా కూడా అన్ని రాశులు ప్రభావితమవుతాయి. ఇదిలా ఉంటే సూర్యగ్రహం ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు.
జనవరి 24న శ్రావణ నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మూడు రాశివారి జీవితాల్లో ఎక్కువగా మార్పులు వస్తాయి. ముఖ్యంగా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి మేలు జరుగుతుందో తెలుసుకోండి.
సూర్యుడు నక్షత్ర సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు విహారయాత్రలకు కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. అలాగే వ్యాపారాల్లో కూడా అధిక లాభాలు సంపాదిస్తారు. వీరు కొత్త ఇండ్లు లేదా వాహనాలు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు.
సూర్యుడి నక్షత్ర సంచారం వల్ల వృషభరాశి వారికి అనేక మార్పులు వస్తాయి. వీరికి వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. అంతేకాకుండా వైవాహిక జీవితం కూడా ఆనందకరంగా ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా భార్యభర్తల మధ్య వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి.
సూర్య గ్రహం నక్షత్ర సంచారం కారణంగా ధనుస్సు రాశివారికి శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా సాగుతాయి.