Actress: రాజేంద్రప్రసాద్ కారణంగా కెరీర్ సర్వనాశనం అయ్యిందంటూ భావోద్వేగానికి గురైన స్టార్ హీరోయిన్!

Rajendra Prasad controversy: రాజేంద్రప్రసాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను తెలుగు బాక్స్ ఆఫీస్ కి అందించారు ఈ హీరో.‌ అయితే ఈ హీరో గురించి ఒక పాపులర్ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ వల్లే తన కెరియర్ పోయిందని ఎమోషనల్ అయింది హీరోయిన్.

1 /6

తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న..నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు..తన చిత్రాలు మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ ఇచ్చాయి. “పెళ్లి పుస్తకం,” “మిస్టర్ పెళ్లాం” వంటి క్లాసికల్ సినిమాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆయన, ప్రస్తుతం వయస్సు కారణంగా కీలక పాత్రల్లో మెరుస్తూ తన సినీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. 

2 /6

ఇక రాజేంద్ర ప్రసాద్ కెరీర్‌లో మంచి విజయం సాధించిన..పెళ్లి పుస్తకం సినిమాలో.. దివ్యవాణి హీరోయిన్‌గా నటించారు. కాగా ఈ హీరోయిన్ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ తన కెరీర్ పోయింది అని చెప్పడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

3 /6

అసలు విషయానికి వస్తే.. ఈ చిత్రం తర్వాత, దివ్యవాణికి మరో అవకాశంగా “మిస్టర్ పెళ్లాం” సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చిందట. కానీ రాజేంద్ర ప్రసాద్ ఎందుకో తెలియదు కానీ.. ఆ సినిమా తనని వద్దు అని చెప్పాలని.. అందుకే ఆ సినిమా నుంచి ఆమెను తప్పించారని దివ్యవాణి ఆరోపించారు.    

4 /6

దివ్యవాణి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, “మిస్టర్ పెళ్లాం సినిమాలో నేను నటించి ఉంటే నా కెరీర్ కొత్త మలుపు తీసుకునేది. రాజేంద్ర ప్రసాద్ కారణంగానే ఆ అవకాశం నాకు దక్కలేదు,” అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటన వల్ల తన కెరీర్ సర్వనాశనం అయ్యిందని, కానీ ఆమని చేసిన పాత్రకు మంచి గుర్తింపు రావడం తనకు ఆనందాన్ని కలిగించిందని చెప్పారు.  “మిస్టర్ పెళ్లాం” సినిమాలో ఆమని నటించిన పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమా కమర్షియల్ హిట్ కావడంతో ఆమని కెరీర్ మరింత బలపడింది. కానీ ఈ చిత్రంలో రాజేంద్రప్రసా దివ్యవాణిని వద్దు అని చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.    

5 /6

దివ్యవాణి ఇప్పటివరకు కేవలం 24 సినిమాల్లో మాత్రమే నటించారు. “పెళ్లి పుస్తకం” ఆఫర్ పోవడం వల్ల ఆమె కెరీర్ బాగా దెబ్బతినిందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె లాంటి హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నప్పటికీ, దివ్యవాణికి గతంలో అనుకున్న స్థాయిలో అవకాశాలు లభించలేదు. కాగా దివ్యవాణి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ వల్ల ఆమె కెరీర్ దెబ్బతిన్నదన్న అంశంపై నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చలు చేస్తున్నారు.  

6 /6

ఇక ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ తన సీనియర్ స్టేటస్‌తో యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరి సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఆయనతో పని చేయాలని దర్శకనిర్మాతలు ఆసక్తి చూపి స్తున్నారు.