Heat: తెలంగాణలో రానున్న రెండు రోజులు మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఏపీలోని ఈ జిల్లాలో అత్యధికం..

Telangana Heat Updates: తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీల వరకు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పగటి ఉష్ణోగ్రతలు ఫిబ్రవరికి ముందు నుంచే నానాటికి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వేడి తీవ్రత కూడా పెరుగుతుంది. మొన్నటి వరకు చలితో బాధపడిన ప్రజలు ఇక ఎండ వేడికి గురవ్వనున్నారు. 
 

1 /5

 ఫిబ్రవరి ప్రారంభం నుంచి ఎండ తీవ్రత పెరిగిపోయింది. ఉక్కపోత కూడా ప్రారంభమైంది.. రాత్రి సమయంలో కాస్త చల్లగా అనిపించినా.. పగటి ఉష్ణోగ్రతలు పొడిగా మారుతున్నాయి. దీంతో ఉక్కపోత  కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.  

2 /5

 ముఖ్యంగా తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల వరకు నమోదు అయినట్లు తెలిపింది వాతావరణ శాఖ.   

3 /5

 రాత్రి సమయంలో కాస్త చలిగా అనిపించినా.. పగటి ఉష్ణోగ్రతలు పొడిగా మారుతున్నాయి. ఎండ తీవ్రత పెరుగుతోంది. దీంతో ఫిబ్రవరి నెలలోనే ఉక్కపోత.. మొదలైంది శివరాత్రికి ముందే ఎండలు బాగా మండుతున్నాయి.  ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.   

4 /5

 తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో 37 డిగ్రీలకు పైగా రికార్డు అయింది. దీంతో ఎండ తీవ్రత పెరిగింది. ఏపీలోను పట్టు పగటి ఉష్ణోగ్రతలు ఇదే పరిస్థితి.. సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కర్నూల్ లో అత్యధికంగా 35 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది.   

5 /5

 ఫిబ్రవరిలోనే ఎండ తీవ్రత పెరగడంతో ఉక్కపోత ప్రారంభమైంది. దీంతో ఎండాకాలం ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొన్నటి వరకు విపరీతమైన చలితో బాధపడిన ప్రజలు ఇక ఎండ వల్ల కలిగే ఉక్కపోత కూడా గురవనున్నారు. వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.