PM Kisan: ఫిబ్రవరి 24న పీఎం కిసాన్‌ నిధుల విడుదల.. లబ్దిదారుల స్టేటస్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

PM Kisan 19th Installment Beneficiary Status: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి 19వ విడుత  నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే, ఈనెల ఫిబ్రవరి 24వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 19వ విడత నిధులు మంజూరు చేస్తారని సమాచారం. పీఎం కిసాన్‌ యోజనలో లబ్దిదారుల స్టేటస్‌ చెక్‌ చేసుకునే విధానం తెలుసుకుందాం.
 

1 /5

ప్రతి ఏడాది చిన్నా, సన్నకారు రైతుల వ్యవసాయ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం రూ.6000 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జమా చేస్తుంది. మూడు విడుతల్లో రూ.2000 నిధులు మంజూరు చేస్తుంది.   

2 /5

ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 18 విడుతలు నిధులు మంజూరు చేసింది. గత ఏడాది అక్టోబర్‌ 5వ తేదీ నిధులు విడుదల చేశారు. అయితే, 19వ విడుత నిధులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 24వ తేదీ బిహార్‌ పర్యటించనున్నారు. అక్కడి నుంచే నిధులను విడుదల చేస్తారని కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ ఇటీవల ప్రకటించారు.  

3 /5

అయితే, ఈ నిధులు పొందడానికి రైతులు ముందుగానే ఇకేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవాలి. మొబైల్‌లో ఇంట్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. లేదా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ (CSC) వెళ్లి కూడా ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. కేవైసీకి రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ కలిగి ఉండాలి.  

4 /5

పీఎం కిసాన్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకునే విధానం.. పీఎం కిసాన్‌ నిధులు క్రెడిట్‌ అయిన తర్వాత బెనిఫిషియరీ స్టేటస్‌ చెక్‌ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. అధికారిక వెబ్‌సైట్‌ pmkisan.gov.in ఓపెన్‌ చేయాలి. అందలో 'బెనిఫిషియరీ స్టేటస్‌' పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.

5 /5

అయితే, ఈ స్టేటస్‌ చెక్‌ చేసుకోవడానికి మీ బ్యాంక్‌ ఖాతా నంబర్‌ ఆధార్‌ నంబర్‌తో లింక్‌ అయి ఉండాలి. ఆ తర్వాత 'Get Data' పై క్లిక్‌ చేయాలి. మీ ముందు లబ్దిదారుల డేటా ఓపెన్‌ అవుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే పీఎం కిసాన్‌కు సంబంధించిన టోల్‌ ఫ్రీ నంబర్‌ అందుబాటులో ఉంటుంది సదరు అధికారులను సంప్రదించాలి.