Pension Scheme For Women: మహిళలకు గుడ్‌న్యూన్‌.. ఈ పథకం నుంచి నేరుగా ఖాతాలోకి రూ. 5,000.. ఇప్పుడే అప్లై చేయండి!

Special Scheme For Women: ప్రతి ప్రభుత్వం మహిళలను సాధికారతను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇందులో చాలా పథకాలు మహిళలకు ఎంతో భరోసాను అందిస్తున్నాయి. దీంతో పాటు వారికి ఈ పథకాలు స్వయంప్రతిపత్తి భావనను కూడా పెంపొందిస్తున్నాయి. ఇలాంటి ఒక అద్భుతమైన పథకాన్నే మీకు ఈ రోజు పరిచయం చేయబోతున్నాం. అదేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

1 /5

ఒడిశా ప్రభుత్వం తమ రాష్ట్ర మహిళలకు అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గతంలో ఒడిశా ప్రభుత్వ ఏర్పాటు చేసిన సుభద్ర యోజన పథకం ద్వారా లక్షలాది మంది మహిళలను ఆర్థిక భరోసా లభిస్తోంది.

2 /5

ఇటీవలే ఒడిశా ప్రభుత్వం సుభద్ర యోజన పథకం దరఖాస్తు ప్రక్రియలో అనేక మార్పులు తీసుకు వచ్చింది. పత్రాలను డిజిటల్ ఫార్మాట్‌లోకి మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఈ పథకం రాష్ట్రంలోని అన్ని మూలల్లోకి చేరేలా చేసిన ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలిపారు.  

3 /5

ఈ సుభద్ర యోజన పథకం కింద ప్రతి ఒక్క మహిళ నేరుగా రూ. 5,000 ఆర్థిక సాయం పొందుతోంది. దీనిని ఒడిశా రాష్ట్ర సర్కార్‌ మహిళల ఖాతాల్లోకే నేరుగా ఆర్థిక సాయాన్ని జమ చేస్తోంది. దీనిని కేవలం ఆ రాష్ట్ర ప్రభుత్వ మహిళలకు మాత్రమే అందిస్తున్నట్లు తెలుస్తోంది.

4 /5

సుభద్ర యోజన పథకాన్ని సులభంగా ఆన్‌లైన్ దరఖాస్తును అప్లై చేసుకోవచ్చు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వ అందిస్తున్న subhadra.odisha.gov.in. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చు.   

5 /5

సుభద్ర యోజన పథకంలో భాగంగా  మొదటి విడత ఆర్థిక సాయం పొందలేని మహిళలు సులభంగా నాల్గవ విడతలతో పొందవచ్చు. అంతేకాకుండా జనవరి మొదటి వారంలో ఈ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. కాబట్టి ఇంతలోపే ఈ పథకాన్ని అప్లై చేసుకుని వారు దరఖాస్తు చేసుకోవచ్చు.