Daaku Maharaaj VsGame Changer: ప్రతి సంక్రాంతికి ఒకటికి మూడు నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటాయి. 2025 పొంగల్ సీజన్ లో ‘గేమ్ చేంజర్’ ‘డాకు మహారాజ్’, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బరిలో ఉన్నాయి. అందులో రెండు చిత్రాలు గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలు విడుదలైయ్యాయి. అయితే.. డాకు వచ్చిన గేమ్ చేంజర్ కు పెద్ద మేకు దింపారనే కామెంట్స్ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సంక్రాంతి బరిలో ముందుగా విడుదలైన ‘గేమ్ చేంజర్’ మూవీకి పూర్తిగా నెగటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ మంచి నటన కనబరిచిన శంకర్ ఈ సినిమాను వంకర టింకర తెరకెక్కించి రామ్ చరణ్ కు పెద్ద మేకు దింపాడనే కామెంట్స్ నెటిజన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ నుంచి వ్యక్తం అవుతున్నాయి.
గేమ్ చేంజర్ విషయంలో మెగాభిమానులు శంకర్ తీరును ఎండగట్టారు. ఒకప్పటి బ్లాక్ బస్టర్స్ ను అందించిన శంకరేనా ఈ సినిమాను తెరకెక్కించాడా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు శంకర్ కాదు వంకర్ అని తిట్టి పోస్తున్నారు అభిమానులు.
మరోవైపు బాలయ్య ‘డాకు మహారాజ్’ సినిమాను బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టు సంక్రాంతి సినిమాగా అన్ని మసాలాలను సమపాళ్లలో రంగరించి తెరకెక్కించాడు దర్శకుడు బాబీ కొల్లి. ప్రేక్షకులతో పాటు నెటిజన్స్ కూడా ఈ సినిమా పై పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
బాబీ రొటీన్ సినిమానే అభిమానులు అలరించేలా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పుకుంటారు. బాలయ్యకు పర్ఫెక్ట్ సంక్రాంతి హిట్ అందించాడని చెప్పుకుంటున్నారు.
మరోవైపు గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్స్ విషయంలో కూడా నెటిజన్స్ కామెంట్స్ దారుణంగా ఉన్నాయి. ఫస్ట్ డే వసూళ్లను చూసి నోరెళ్ల బెడుతున్నారు. ఈ వసూళ్లు కూడా ఉత్తుత్తివే అంటున్నారు. మొత్తంగా గేమ్ చేంజర్ విషయంలో రామ్ చరణ్ ను శంకర్ బలి పశువు చేసాడనే కామెంట్సే వినిపిస్తున్నాయి.
మొత్తంగా ‘గేమ్ చేంజర్’ రిజల్ట్ విషయంలో అన్ని వేళ్లు శంకర్ వైపే చూపిస్తున్నాయి. అదే ‘డాకు మహారాజ్’ సినిమాతో బాబీ కొల్లి..బోయపాటి శ్రీను తర్వాత ఆ రేంజ్ మాస్ డైరెక్టర్ గా బాలయ్య తగ్గ హిట్ ఇవ్వడమే కాకుండా.. దర్శకుడిగా తన రేంజ్ పెంచుకున్నాడు.
మెగా కాంపౌండ్ డైరెక్టర్ అయిన బాబీ కొల్లి.. బాలయ్య ‘డాకు మహారాజ్’ సినిమాతో గేమ్ చేంజర్ కు పెద్ద మేకు దింపాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా బాలకృష్ణ.. ఖాతాలో మరో సంక్రాంతి హిట్ పడినట్టే అని ట్రేడ్ వర్గాలతో పాటు నెటిజన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.