Sobhita Dhulipala: మెగా కోడలిని డామినేట్ చేస్తున్న శోభిత ధూళిపాళ.!. ఏ మాత్రం తగ్గట్లేదుగా.. మ్యాటర్ ఏంటంటే..?

Sobhita Dhulipala news: నాగచైతన్య తండేల్ సక్సెస్ ను ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చైతుకు ఈ మూవీతో చాలా గ్యాప్ తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ దొరికినట్లైంది.
 

1 /6

నాగచైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ మూవీ ప్రస్తుతం బ్లాక్ బాస్టర్ హిట్ను సొంతం చేసుకుంది . అంతేకాకుండా.. వంద కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది. చందు మొండేటీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. 

2 /6

ఈ సినిమా ఫిబ్రవరి 7 న అభిమానుల ముందుకు వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో మత్క్సకారుల జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు అభిమానుల నుంచి ఒక రేంజ్ లో పాజిటిట్ రెస్సాన్స్ వస్తుంది.

3 /6

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తండేల్ మూవీ సక్సెస్ తో అక్కినేని అభిమానులు సైతం ఫుల్ ఖుషీగా ఉన్నారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత నాగార్జున తండేల్ మూవీ సక్సెస్ ఈవెంట్ కు హజరయ్యారు. చాలా ఎమోషనల్ అయ్యారు. ఇదంతా శోభిత వచ్చిన వేళా విశేషమంటూ తన కోడలికి క్రేడిట్ ఇచ్చారు.

4 /6

అయితే.. తండేల్ మూవీ జాతర ఈవెంట్, ఆతర్వాత ప్రొగ్రామ్ లలో కూడా శోభిత ఎంతో సాంప్రదాయ బద్దంగా, హుందాగా చీరకట్టుకుని ఈవెంట్ లకు హజరయ్యారు. గతంలో శోభిత పెళ్లి తర్వాత కూడా కాస్తంత బోల్డ్ డ్రెస్ లలో కన్పించారు.  దీంతో కొందరు శోభితను ట్రొల్స్ సైతం చేశారు.

5 /6

కానీ ఇటీవల శోభిత మాత్రం.. హుందాగా పబ్లిక్ కార్యక్రమాల్లో చీర కట్టుకుని కన్పించడం పట్ల అభిమానులు  ఫుల్ ఖుషీ అవుతున్నారంట. అక్కినేని ఫ్యామిలీకి కొడలు హుందాగా కన్పించడం పట్ల అభిమానులు శోభిత చాలా మారిందని అనుకుంటున్నారంట. సాంప్రదాయాలకు పెద్ద పీట వేసేలా చీర కట్టుకుంటే... ఆ రెస్పెక్ట్ వేరేలా ఉంటుందని కూడా అంటున్నారంట.  

6 /6

మరోవైపు శోభిత మెగా కోడలు లావణ్య బాటలోనే వెళ్తున్నారని టాక్ నడుస్తొంది. లావణ్య కూడా మెగా కుటుంబానికి తన వల్ల ఎలాంటి చెడ్డ పేరు రాకూడదని కేవలం ఫ్యామిలీ సినిమాలు,  లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఆసక్తి చూపుతున్నారు. అయితే.. శొభిత కూడా ఈ విషయంలో లావణ్యను డామినేట్ చేసే విధంగా కేవలం సాంప్రదాయంగా కన్పించే విధంగా, లేడీ ఓరియంటేడ్ సినిమాలు తీయడం కోసం మాత్రమే ఇంట్రస్ట్ కనబరుస్తున్నారంట. ఈ క్రమంలో ప్రస్తుతం మెగా కోడల్ని, అక్కినేని కోడలు శోభిత డామినేట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా చర్చలు నడుస్తున్నాయి.