Urvashi Rautela: డాకు మహారాజ్ ఓటీటీ.. ‘భారతదేశంలోనే మొదటి మహిళగా..’

Urvashi Rautela Daaku Maharaaj: డాకు మహారాజ్ ఓటీటీ విడుదలకు ముహూర్తం ఫిక్సయిన సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించిన డాకు మహారాజ్  థియేటర్లలో మంచి వసూళ్లు సాధించి.. ఫిబ్రవరి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

1 /6

తెలుగు చిత్రసీమలో ఎంతో ఆసక్తిని రేకెత్తించిన డాకు మహారాజ్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్లలో మంచి ఓపెనింగ్ సాధించింది. తాజాగా, నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రానికి ఓటీటీ విడుదల తేదీని ప్రకటించింది.    

2 /6

డాకు మహారాజ్ మొదటి రోజు ₹30.2 కోట్లు వసూలు చేసింది. అందులో ఏపీ, తెలంగాణ నుంచి ₹27.25 కోట్లు వచ్చాయి. తొలి వారం చివరికి ₹78.8 కోట్లు వసూలు కాగా, రెండో వారం ₹20.05 కోట్లు, మూడో వారం ₹6.32 కోట్లు, నాల్గో వారం ₹2.26 కోట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం ₹107.43 కోట్లు సాధించినప్పటికీ, సినిమా పెద్దగా లాభాలు అందుకోలేకపోయింది.  

3 /6

నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఫిబ్రవరి 21న డాకు మహారాజ్ ఓటీటీలో విడుదల కానుంది. ఈ తేదీ ఊర్వశి రౌటేలా పుట్టినరోజుకు (ఫిబ్రవరి 25) ముందే నిర్ణయించడం విశేషం.  ఈ సినిమాలోని 'డబిడీ డిబిడీ' పాట యూట్యూబ్‌లో పెద్దగా హిట్ అయింది. హిందీ వెర్షన్ 2.1 మిలియన్ వ్యూస్, తెలుగు లిరికల్ వీడియో 30 మిలియన్ వ్యూస్, ఫుల్ వీడియో 5.3 మిలియన్ వ్యూస్ సాధించింది.  

4 /6

ఈ క్రమంలో ఈ సినిమా విజయం గురించి ఊర్వశి అప్పట్లో చేసిన కామెంట్లు ఎన్నో వివాదాలకు దారితీసాయి. ముఖ్యంగా సైఫా ఆలీ ఖాన్ ని కత్తితో పొడిచిన ఇన్సిడెంట్ గురించి మీడియా అడగక.. ఊర్వశి అర్థం లేకుండా.. డాకు మహారాజ్ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడి బాలీవుడ్ ప్రేక్షకులను ఆగ్రహానికి గురిచేసింది.

5 /6

చాలా సందర్భాల్లో అసలు సంబంధం లేకుండా ఈ సినిమా గురించి బాలీవుడ్ మీడియా దగ్గర ఊర్వశి చెప్పడం ఎన్నో విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా పోస్టర్ లో ఊర్వశి లేకపోవడంతో.. కొంతమంది హిందీ అభిమానులు..”ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళ.. ఇలా సినిమా పోస్టర్ నుంచి తీసేయడం ఇదే మొదటిసారి..,”అంటూ కిందలు గా కామెంట్లు పెడుతున్నారు.

6 /6

ఓటీటీ పోస్టర్ విషయంలో ఊర్వశి రౌటేలా లేకపోవడంతో.. "₹105+ కోట్లు వసూలు చేసిన సినిమాలో ప్రముఖ నటిని పోస్టర్‌లో చేర్చలేదు" అంటూ అప్పట్లో ఊర్వశి చేసిన కామెంట్లకు ఇప్పుడు సెటైర్లు వేస్తున్నారు బాలీవుడ్ సినీ ప్రేక్షకులు.