Vande bharat special trains for maha kumbh: కుంభమేళ భక్తులకు ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. మూడు రోజుల పాటు వందే భారత్ రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది.
ప్రయాగ్ రాజ్ కుంభమేళకు కోట్లలో భక్తులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన మహా కుంభ్ కావడంతో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే భక్తులు ప్రత్యేక వాహానాలు, రైళ్లు, విమానాలలో కుంభమేళకు వెళ్తున్నారు.
ఈ క్రమంలో కుంభమేళలో ఎక్కడ చూసిన కూడా భక్తులతో కిక్కిరిసి పోయింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళ, ఫిబ్రవరి 13న వరకు కొనసాగనుంది. మరో షాహీ స్నానం మిగిలి ఉండగా.. ఇప్పటికే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన వారు 50 కోట్లు దాటేశారని కూడా ఇప్పటికే యూపీ సర్కారు ప్రకటించింది.
ఇంకా కుంభమేళకు భక్తులు రద్దీ మాత్రం తగ్గడంలేదు. ఇంకా వెళ్తునే ఉన్నారు. భక్తుల రద్దీని సరిపడా.. సదుపాయాలు లేకపొవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కుంభమేళలో చాలా మంది రైళ్లలో వెళ్తున్నారు. ముఖ్యంగా కుంభమేళకు వెళ్లే ట్రైన్ లలో ఏసీ, టూ, త్రి టైర్ అంతా.. జనరల్ భోగీ లానే మారిందని చెప్పుకొవచ్చు.
కుంభమేళలో చాలా మంది తమకు ట్రైన్ లలో కనీసం నిలబడేందుకు స్థలం దొరకడంలేదని ఆగ్రహాంతో అద్దాలు సైతం ఇటీవల పగలగొడుతున్నారు. ఈ క్రమంలో కుంభమేళలో దాదాపు.. 300 కి. మీల మేర ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. అయితే.. కుంభమేళకు వెళ్లే వారికి ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.
నేటి నుంచి అంటే.. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు స్పెషల్ వందే భారత్ ట్రైన్ లను నడిపిస్తున్నట్లు వెల్లడించింది. ట్రాఫిక్, ఇతర సమస్యలతో మహా కుంభమేళాకు వెళ్లేవారికి ఇబ్బంది కలగకుండా భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పింది.
ఈ ప్రత్యేక వందే భారత్ రైలు ఈనెల 15, 16, 17వ తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ రైలు ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్ మీదుగా వారణాసి వరకు ప్రయాణించనున్నట్లు నార్తర్న్ రైల్వేసే స్పష్టం చేసింది. 02252 నంబర్ వందే భారత్ ప్రత్యేక రైలు దీనికోసం ప్రత్యేకంగా నడవనుంది. మరిన్ని వివరాలకు ఇండియన్ రైల్వేస్ అధికారిక పోర్టల్ ను సందర్శించాలని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.